- Advertisement -
పెద్దపల్లి జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. ఐరన్ కాయిల్స్‌ను తీసుకెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో గూడ్స్ రైలు 11 బోగీలు బోల్తా కొట్టాయి. ఈ ప్రమాదంతో 3 రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. పెద్దపల్లి మండలం రాఘవపూర్-కన్నాల రైల్వే లైన్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంతో పలు రైళ్లను నిలిపివేశారు. ఘటనాస్థలంలో మరమత్తులు ప్రారంభించిన అధికారులు.. ట్రాక్ పునరుద్దరణ, బోల్తా కొట్టిన రైలు బోగీలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -