Wednesday, January 22, 2025

గుజరాత్‌లో పట్టాలు తప్పిన గూడ్సు

- Advertisement -
- Advertisement -

గుజరాత్‌లోని వల్సడ్, సూరత్ స్టేషన్ల మధ్య ఒక గూడ్సు రైలు శుక్రవారం పట్టాలు తప్పింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు అయినట్లు వార్తలు రాలేదని పశ్చిమ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. కాగా..సాయంత్రం 3 గంటలకు దుంగ్రి స్టేషన్ సమీపంలో ఈ జరిగిన ఈ ఘటన కారణంగా ఆ రూటులో రైళ్ల రాకపోకలకు అంతరయాం ఏర్పడింది. గూడ్సు రైలు సూరత్‌కు వెళుతుండగా పట్టాలు తప్పినట్లు అధికారి చెప్పారు. రైల్వే భద్రత, ఇతర అంశాలపై ఇక్కడి పశ్చిమ రైల్వే ప్రధాన కార్యాలయంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రైల్వే అధికారులతో సమీక్షిస్తున్న సమయంలో ముంబై-అహ్మదాబాద్ ట్రంక్ రూట్‌లో ఈ ఘటన జరగడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News