Friday, December 27, 2024

ఫ్లాట్‌పామ్ పైకి దూసుకొచ్చిన గూడ్స్… ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: గూడ్స్ రైలు ఫ్లాట్‌ఫామ్ మీదికి దూసుకరావడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన ఒడిశా రాష్ట్రం జాజ్‌పూర్‌లో జరిగింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…జాజ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు రైల్వే కోసం ఫ్లాట్‌ఫామ్ నిరీక్షిస్తున్నారు. అదే సమయంలో గూడ్స్ రైలు అదుపుతప్పి ఫ్లాట్‌ఫామ్ పైకి దూసుకెళ్లడంతో పది బోగీలు బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణీకులు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. రైల్వే స్టేషన్‌లో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి సగం భాగం వరకు కూలిపోయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రైల్వే సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News