Monday, April 7, 2025

సంసద్ టివి యూట్యూబ్ ఖాతా రద్దు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: యూట్యూబ్ మార్గదర్శకాలను ఉల్లంఘించారన్న ఆరోపణపై లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేసే సంసద్ టివికి చెందిన యూట్యూబ్ ఖాతాను గూగుల్ రద్దు చేసినట్లు తెలుస్తోంది. సంసద్ టివికి చెందిన యూట్యూబ్ హ్యాక్ అయిందని, ఇప్పుడు దాని పేరు ఇథీరియం అనే క్రిప్టో కరెన్సీగా మారిందని సోఓషల్ మీడియాలో ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీనిపై అధికారిక సమాచారమేదీ లేనప్పటికీ ఈ సమస్యను గూగుల్ వద్దకు తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. హ్యాకింగ్ లాంటిదేదో జరిగిందని, గూగుల్‌కు దీనిపై ఫిర్యాదు చేశామని, ఆ విషయాన్ని గూగుల్ పరిశీలిస్తోందని ఆ అధికారి చెప్పారు. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించినందుకు ఈ ఖాతాను రద్దు చేసినట్లు సంసద్ టివికి చెందిన యూట్యూబ్ ఖాతాపై కనపడుతున్న స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో ప్రస్తుతం దర్శనమిస్తున్నాయి.

Google ban Sansad TV Youtube channel

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News