- Advertisement -
న్యూఢిల్లీ : టెక్నాలజీ కంపెనీ గూగుల్ తన ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. కంపెనీలో డిజిటల్ అసిస్టెంట్, హార్డ్‌వేర్, ఇంజనీరింగ్ టీమ్‌ల నుండి వందలాది మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఖర్చును తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా ఈ చర్య అని కంపెనీ తెలిపింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, గూగుల్‌లో తొలగింపు వల్ల ప్రభావితమైన ఉద్యోగులలో వాయిస్ ఆధారిత గూగుల్ అసిస్టెంట్, ఆగ్మెంటెడ్ రియాలిటీ హార్డ్‌వేర్ టీమ్‌లకు చెందిన వ్యక్తులు ఉన్నారు. ఇంకా గూగుల్ సెంట్రల్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్ ఉద్యోగులు కూడా తొలగింపుల వల్ల ప్రభావితం కానున్నారు.
- Advertisement -