Monday, December 23, 2024

అర్హతలు ఎక్కువగా ఉన్నాయని యువతికి ఉద్యోగాన్ని తిరస్కరించిన కంపెనీ

- Advertisement -
- Advertisement -

ఉద్యోగాల భర్తీ సమయంలో ఎక్కువ అర్హతలు ఉన్న అభ్యర్థులకే కంపెనీలు ప్రాధాన్యం ఇస్తుంటాయి. జీతం కాస్త ఎక్కువైనా అనుభవం ఉన్నవారి వైపు మొగ్గు చూపుతుంటాయి. కానీ, ఒక స్టార్టప్ కంపెనీ ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. అసాధారణ రీతిలో ఎక్కువ అర్హతలు ఉన్న అభ్యర్థిని సంస్థ తిరస్కరించింది. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న ఒక గూగుల్ టెకీ తనకు ఎదురైన ఈ ఆసక్తికర అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అర్హతలు చాలా మంచిగా ఉండడంతో తనకు ఉద్యోగాన్ని తిరస్కరించారని ఆమె వాపోయారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారింది. అను శర్మ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తాను గూగుల్‌లో పని చేస్తున్నానని, ఇటీవల ఒక స్టార్టప్ కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు పంపితే అసాధారణ రీతిలో తిరస్కరణకు గురైందని ఆమె తెలిపారు.

‘అర్హతలు చాలా మంచిగా ఉన్నప్పటికీ ఉద్యోగాన్ని తిరస్కరిస్తారని నాకు తెలియదు’ అనే క్యాప్షన్‌తో సదరు కంపెనీ నుంచి వచ్చిన సమాధానం స్క్రీన్ షాట్లను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. కాగా, అన్నూ శర్మకు ఉద్యోగాన్ని తిరస్కరించడానికి కారణాన్ని సదరు స్టార్టప్ కంపెనీ వివరించింది. ‘మీ రెజ్యూమెను పరిశీలించిన తరువాత మీ అర్హతలు ఈ ఉద్యోగ అవసరాలకు మించి ఉన్నాయని మేము గమనించాం. అధిక అర్హతలు ఉన్న అభ్యర్థులు వారి బాధ్యతలు సంపూర్ణంగా పూర్తి చేయడం లేదు. అంతే కాదు. కంపెనీలో చేరిన కొద్ది కాలానికే వెళ్లిపోతారని మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం’ అని కంపెనీ వివరించింది. నోటిఫికేషన్‌లో తాము పేర్కొన్న ఉద్యోగానికి సూచించిన అర్హతలు మాత్రమే సరిపోతాయని ముందుగానే సూచించినట్లు సంస్థ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News