Saturday, October 5, 2024

త్వరలో గూగుల్ ఇండియా ఆపరేషన్స్ కి అదానీ విద్యుత్తు!

- Advertisement -
- Advertisement -

అదానీ గ్రూప్ భారతదేశంలోని గూగుల్ క్లౌడ్ సేవలు మరియు కార్యకలాపాలను శక్తివంతం చేయడానికి క్లీన్ ఎనర్జీని సరఫరా చేస్తుంది. గ్రూప్ గుజరాత్‌లోని 30 గిగావాట్ల ఖవ్దా పునరుత్పాదక ఇంధన పార్కులో ఉన్న కొత్త సోలార్-విండ్ హైబ్రిడ్ ప్రాజెక్ట్ నుండి శక్తిని సరఫరా చేస్తుందని అదానీ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. సోలార్-విండ్ హైబ్రిడ్ ప్రాజెక్ట్ 2025 మూడవ త్రైమాసికంలో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభిస్తుంది.

గూగుల్ తన క్లౌడ్ కార్యకలాపాలు , సేవలకు చాలా వరకు గ్రిడ్ నుండి పొందే విద్యుత్‌నే వాడుతోంది. 2030 నాటికి వాటిని పూర్తిగా ‘క్లీన్ ఎనర్జీ’ ద్వారా నడపాలని యోచిస్తోంది.

“ఈ భాగస్వామ్యం ద్వారా గుజరాత్‌లోని ఖవ్డాలో ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన కర్మాగారం కొత్త సోలార్-విండ్ హైబ్రిడ్ ప్రాజెక్ట్ నుండి అదానీ కంపెనీ స్వచ్ఛమైన శక్తిని సరఫరా చేస్తుంది. ఈ కొత్త ప్రాజెక్ట్ 2025 మూడవ త్రైమాసికంలో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది” అని అదానీ గ్రూప్ తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News