Monday, December 23, 2024

ఇంటర్‌నెట్ విప్లవ ఫలాలు!

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం గూగుల్‌ను ‘కింగ్ ఆఫ్ ఆల్ ఇంటర్ నెట్స్’గా పిలుస్తున్నారు. గూగుల్ పదానికి విస్తరణగా ‘గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఓరియంటెడ్ గ్రూప్ లాంగ్వేజ్ ఆఫ్ ఎర్త్’ ను వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్లు, ట్యాబులు, కంప్యూటర్లు, లాప్‌ట్యాప్‌లు, కెమెరాలు, టివిలు, ఇతర ఎలెక్ట్రానిక్ ఉపకరణాలు వైఫై సహాయంతో ఇంటర్నెట్ సౌకర్యాలను పొందడం వరంగా మారింది. విశ్వవ్యాప్తంగా నేడు ఒక బిలియన్ వెబ్‌సైట్లు వాడుకలో ఉన్నాయి. ఇంటర్‌నెట్ ఆధార కంపెనీలు మైక్రోసాఫ్ట్ 75 బిలియన్లు, ఆపిల్ 45 బిలియన్లు, ఫేస్‌బుక్ 44 బిలియన్లు, గూగుల్ 35 బిలియన్ల అమెరికన్ డాలర్ల బడా వ్యాపారం చేస్తున్నాయి.

Google is King of all Internets

మానవ పరిణామ క్రమంలో నాటి పాత రాతి యుగం నుంచి నేటి నవ్య నానో -డిజిటల్ యుగం వరకు జరిగిన శాస్త్ర సాంకేతిక విప్లవంతో మానవాళి జీవనశైలిలో సమూల మార్పు లు చోటు చేసుకున్నాయి. ప్రపంచమే కుగ్రామమై పోయింది. ఇ -మెయిల్, యూ ట్యూబ్, వాట్సాప్, ఫేస్‌బుక్, గూగుల్, ట్విట్టర్, ఇన్టాగ్రామ్, మెసేంజర్ లాంటి సామాజిక మాధ్యమాలు మన నిత్య జీవితంలో భాగం అయ్యా యి. ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్ల వ్యవస్థను రిమోట్ కంట్రోల్ ద్వారా అనుసంధానం చేస్తూ సమాచారాన్ని ఒకరి నుండి మరొకరికి చేర్చడాన్ని ఇంటర్‌నెట్‌గా చెప్పుకుంటున్నాం. ఇంటర్నెట్ లేదా ఇంటర్ కనెక్టెడ్ నెట్‌వర్క్ వాడకుండా గంట గడవడం అసాధ్యంగా తోస్తున్నది. అరచేతిలో వైకుంఠం చూపే స్మార్ట్ ఫోన్ మానవ శరీరంలో ఒక శాశ్వత అంగమై కూర్చుంది.
నేటి ‘వరల్డ్ వైడ్ వెబ్ (డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు)’ ను 1989లో ‘టిమ్ బెర్నర్స్ లీ’ లు కనుగొన్నారు. వరల్డ్ వైడ్ వెబ్, ఇంటర్‌నెట్ ప్రక్రియల ఆవిష్కరణలతో గత 30 సంవత్సరాలుగా గ్రామీణం నుండి మహానగరాల వరకు, పల్లె గల్లీ నిరక్షరాస్యుడి నుంచి పట్టణ పట్టభద్ర డిజిటల్ నైపుణ్య మేధావి వరకు సాంకేతిక విప్లవ ఫలాలు అందడం అమిత ఆనందాన్ని కలిగిస్తున్నది. 29 అక్టోబర్ 1969 రోజున ప్రప్రథమంగా కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ‘చార్లీ క్లైన్, లియొనార్డ్ క్లీన్‌రాఖ్’ ల చోరవతో తొలి ప్రయత్నంగా ‘యల్’ అండ్ ‘ఓ’ అనే ‘లాగిన్’ పదాన్ని ఎలెక్ట్రానిక్ ఇంటర్నెట్ మెసేజ్ ద్వారా విజయవంతంగా పంపించడం జరిగింది.
ఇంటర్‌నెట్ అద్భుత ఆవిష్కరణతో ప్రపంచ వ్యాప్తంగా పలు ఆధునిక డిజిటల్ రంగ అనువర్తనాలు వ్యక్తి జీవితంలో పెను మార్పులకు దారి తీస్తున్నాయి. ఇంటర్‌నెట్ డిజిటల్ విప్లవ ప్రాధాన్యతను గమనించిన సాంకేతిక సమాజం 2005 నుండి ప్రతి యేటా 29 అక్టోబర్ రోజున అంతర్జాతీయ ఇంటర్‌నెట్ దినం (ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డే) పాటించడం జరుగుతున్నది. ప్రారంభంలో ఇంటర్నెట్‌ను ‘ఆర్పనెట్’ గా పిలిచేవారు. ప్రస్తుత రూపం ‘ఇంటర్నెట్’గా పిలువబడుతూ అసాధారణ విస్తరణతో ‘ఇన్ఫర్‌మేషన్ సూపర్ హైవే’ స్థాయి రావడానికి అనేక మంది శాస్త్రజ్ఞులు, ప్రో గ్రామర్లు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల కృషి దాగి ఉందని గమనించాలి. ఇంటర్నెట్‌లో ‘సర్ఫింగ్’ అనే పదాన్ని 1992లో ‘జీన్ ఆర్మర్ పోల్లీ (నెట్ మమ్ అని కూడా పిలుస్తారు)’ ప్రవేశపట్టడం జరిగింది. గూగుల్ సహాయంతో ఒక ప్రశ్నకు కంప్యూటర్ 0.2 సెకన్‌లలో సమాధానం ఇస్తున్నది.
ఇంటర్నెట్ సహాయంతో ఫేస్‌బుక్ అనబడే సామాజిక మాధ్యమాన్ని 2004లో ‘మార్క్ జుకెర్ బర్గ్‘ కనిపెట్టడం జరిగింది. 1971లో ‘రే టాం లిన్సన్’ ప్రప్రథమ ఇ మెయిల్ పంపడంతో ఆరంభమై, నేడు 3.6 బిలియన్ల ఇ -మెయిల్ అకౌంట్లతో రోజుకు 294 బిలియన్ల ఇంటర్నెట్ ఇ -మెయిల్స్ ప్రపంచ వ్యాప్తంగా పంపించే స్థాయికి చేరింది. 1990లో మైక్రోసాఫ్ట్ విండో స్, 1994లో యాహూ, 1995లో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, 1998లో గూగుల్, 2006లో ట్విట్టర్‌లు లాంటి అనేక యాప్‌లు వాడుకలోకి వచ్చాయి. 23 ఏప్రిల్ 2005న తొలి ‘యూ ట్యూబ్’ వీడియోను సాంకేతిక నిపుణుడు ‘సాన్ డీగో జూ’ అప్‌లోడ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వాడడానికి 50 మిలియన్ హార్స్ పవర్ విద్యుత్తు అవసరం అవుతున్నది. ప్రస్తుతం గూగుల్‌ను ‘కింగ్ ఆఫ్ ఆల్ ఇంటర్ నెట్స్’గా పిలుస్తున్నారు. గూగుల్ పదానికి విస్తరణగా ‘గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఓరియంటెడ్ గ్రూప్ లాంగ్వేజ్ ఆఫ్ ఎర్త్’ ను వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్లు, ట్యాబులు, కంప్యూటర్లు, లాప్‌ట్యాప్‌లు, కెమెరాలు, టివిలు, ఇతర ఎలెక్ట్రానిక్ ఉపకరణాలు వైఫై సహాయంతో ఇంటర్నెట్ సౌకర్యాలను పొందడం వరంగా మారింది. నేడు విశ్వవ్యాప్తంగా ఒక బిలియన్ వెబ్‌సైట్లు వాడుకలో ఉన్నాయి. అంతర్జాల ఆధార కంపెనీలు మైక్రోసాఫ్ట్ 75 బిలియన్లు, ఆపిల్ 45 బిలియన్లు, ఫేస్ బుక్ 44 బిలియన్లు, గూగుల్ 35 బిలియన్ల అమెరికన్ డాలర్ల బడా వ్యాపారం చేస్తున్నాయి.
ఇంటర్‌నెట్‌తో ఎలెక్ట్రానిక్ మెయిల్స్, పరిశోధనలు, డౌన్ లోడ్ ఫైల్స్, ఆన్‌లైన్ చర్చలు, గేమ్స్, ఇ -విద్య, స్నేహం, ప్రింట్ మీడియా, సామాజిక మాధ్యమాలు, విజ్ఞాన వినిమయం, చలన చిత్రాలు, ఫైల్ ట్రాన్స్‌ఫర్, వర్చువల్ సమావేశాలు, ఇ లైబ్రరీ, కృత్రిమ మేధ, ఆర్థిక, బ్యాంకింగ్ కార్యకలాపాలు మెుదలగు అనేక రంగాలలో విస్తృత ఉపయోగాలు ఉన్నాయి. మానవాళికి ఇంటర్‌నెట్ గొప్ప వరంగా మారినప్పటికీ, మరో కోణంలో శాపంగా పరిణమించడం విచారకరం. పిల్లలకు కరోనా విధించిన ఆన్‌లైన్ ఇ -తరగతులతో ఉపయోగపడుతున్న స్మార్ట్ ఫోన్‌లు మరో వైపు అశ్లీల అభ్యంతరకర ఇంటర్‌నెట్ మాధ్యమాలు అరచేతిలో అందుబాటులోకి రావడం వారి భవిష్యత్తుకే ప్రమాదకరంగా మారుతోంది. స్మార్ట్ ఫోన్ వినియోగం దుర్వసనంగా మారింది. నీలికాంతితో కంటి చూపు దెబ్బ తినడం, సమయం వ్యర్థం చేయడం, నేర ప్రవృత్తికి బీజాలు పడడం, ఓపిక నశించడం, అనారోగ్య సమస్యలు, ఏకాగ్రత లోపించడం, సమాజానికి దూరంగా ఒంటరితనం కోరుకోవడం, దురలవాట్లను ప్రేరేపించడం, అశ్లీల సైట్లకు అలవాటు పడడం, పనిలో శ్రద్ధ తగ్గడం, స్థూలకాయ రుగ్మతలు, అనవసర వస్తువులు ఆన్ లైన్‌లో కొనడం, నిద్ర లేమి, సైబర్ నేరాలు మెుదలగు విష ప్రభావాలను సమాజం చవిచూడవలసి వస్తున్నది. అంతర్జాల నేరాలను కట్టడి చేయడానికి సైబర్ నేరాల అదుపుకు సంబంధించిన కొత్త చట్టాలు కూడా అందుబాటుకి రావడం చూస్తున్నాం. కంప్యూటర్ అక్షరాస్యత కనీస అర్హత అవుతున్నది. నిరక్షరాస్యులు కూడా ఇంటర్‌నెట్‌ను వినియోగిస్తున్నారు. నిత్య జీవితంలో మనిషిని ఇంటర్‌నెట్ చుట్టేస్తున్నది. ఇలాంటి ఇంటర్నెట్‌ను సురక్షితంగా మానవాళి సుస్థిరాభివృద్ధికి వాడుతూ, దుష్ప్రభావాలకు దూరంగా ఉంటూ, సుఖశాంతులు, సంపదలతో వసుధైక కుటుంబాన్ని నిర్మించుకుందాం. ఇంటర్‌నెట్ ఆత్మసౌందర్య వికాసానికి, సులభతర జీవన విధానానికి వినియోగించుకుందాం. ‘ఇంటర్నెట్ ఈజ్ ఫర్ బెట్టర్‌మెంట్’ అనే నినాదాన్ని ప్రచారం చేద్దాం.

డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News