Friday, January 10, 2025

గూగుల్ మ్యాప్‌ను నమ్మితే నట్టేట్లోకి…

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/అక్కన్నపేట: గూగుల్ మ్యాప్‌ని నమ్ముకొని నేరుగా ప్రా జెక్టు నీటిలోకి దూ సుకెళ్లిన ఘటన సిద్దిపేట జిల్లా, అక్కన్నపేట మండలంలో చో టుచేసుకుంది. పూర్తి వివరాల్లో కి వెళితే.. హనుమకొండ నుండి హైదరాబాద్‌కు వయా రామవరం మీదగా ఒక వ్యక్తి జెసిబిని డీసీఎంలో తీసుకొని శనివారం రాత్రి 9 గంటల సమయంలో వెళ్తున్నాడు. అతనికి దారి తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్ సహాయం తీసుకున్నాడు.

ఈ క్రమంలో నందారం స్టేజి వద్ద కుడివైపుగా చూపించాల్సిన మ్యాప్ ఎడమవైపు చూపించడంతో నేరుగా గౌరవెల్లి ప్రాజెక్టు నీటిలోకి దూసుకెళ్లాడు. ప్రాజెక్టులో నీళ్లు పెరగడంతో తప్పుదారికి వెళ్లానని గ్రహించి, అక్కడే ఆగిపోయాడు. లేదంటే నీట మునిగి పెద్ద ప్రమాదమే జరుగుండేదని భయపడ్డాడు. ఆదివారం ఉదయం ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్థులు జెసిబి సహాయంతో డీసీఎంను బయటకి తీశారు.

గత నాలుగు నెలల క్రితం కూడా ఓ లారీ డ్రైవర్ గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని ఇదే ప్రాజెక్టులోకి దూసుకెళ్లాడు. మళ్లీ ఇప్పుడు కూడా అదే తరహాలోనే జరిగిందంటూ పలువురు చర్చించుకుంటున్నారు. పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగకముందే సంబంధిత అధికారులు చొరవ తీసుకొని ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో శాశ్వత సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News