Monday, December 23, 2024

గూగుల్ మ్యాప్స్ కు ఆరు కొత్త ఫీచర్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గూగుల్ తన ఇండియా మ్యాప్స్ కు ఆరు కొత్త అంశాలు జోడించింది. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ తో  కొత్త మ్యాప్ లను చూయిస్తుంది. అందుకు స్థానిక భాగస్వామ్యాన్ని కూడా తీసుకోనున్నది. ఇది పర్యటించే వారికి ఉపయోగపడనున్నది. ఈ వారంలోనే దీనిని ప్రవేశపెట్టబోతున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , జియోస్పేషియల్ టెక్నాలజీలతో ఈ కొత్త మ్యాపులను తీసుకురాబోతున్నది.

ఈ కొత్త మ్యాప్ ల ద్వారా ఇరుకు రోడ్లు, ఫ్లయ్ ఓవర్లు, ఈవి ఛార్జింగ్ స్టేషన్లు వంటివి చూయించబోతున్నది. నూతన అన్వేషణలకు ఇండియా కేంద్రం అని గూగుల్ మ్యాప్స్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ మిరియం డానియల్ తెలిపారు.

గూగుల్ మ్యాప్స్ ఇదివరలో అనేక విమర్శలు ఎదుర్కొంది. దాని అనుసరిస్తూ వెళితే వాగులోకి తీసుకెళ్లిందని కూడా విమర్శలు ఉన్నాయి. కానీ ఇప్పుడు రూటింగ్ ఆల్గో రిథమ్స్ ద్వారా ఇరుకు దారులు, ఫోర్ వీలర్స్ వెళ్ళలేని దారులను కూడా తెలుపబోతున్నది. ప్రస్తుతం ఈ కొత్త మ్యాప్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లలో తీసుకురాబోతున్నారు. తర్వాత దేశమంతటా విస్తరించనున్నారు.

Narrow road avoidance

flyover navigation

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News