Sunday, December 22, 2024

గూగుల్ మ్యాప్‌కి యువ సాప్ట్ వేర్ ఇంజనీర్ చరణ్ బలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గూగుల్ మ్యాప్ ఒకరి ప్రాణాలు బలిగొంది. గూగుల్ మ్యాప్స్‌ను ఆశ్రయించిన ఓ యువకుడు దారి తప్పి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు కేబుల్ బ్రిడ్జ్ రూట్ కోసం గూగుల్ మ్యాప్ ఆన్ చేశాడు. గూగుల్ మ్యాప్ కేబుల్ బ్రిడ్జికి బదులుగా పివి ఎక్స్ ప్రెస్ వే మార్గాన్ని చూపించింది. తప్పును గ్రహించిన యువకుడు తిరిగి సరైన దారిలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. సరిగ్గా అదే సమయంలో ప్రమాదానికి లోనయ్యాడు. గూగుల్ మ్యాప్ ద్వారా గమ్యస్థానానికి చేరకుండానే మృతి చెందాడు. గూగుల్ మ్యాప్ చూస్తూ ఆరాంఘర్ వద్ద ద్విచక్ర వాహనాన్ని పివిఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ మీదకు రాంగ్ రూట్‌లో వెళ్లిపోయాడు.

Also Read: కాంగ్రెస్ ఎక్కడ బలంగా ఉంటే అక్కడ టిఎంసి మద్దతు : మమత

మెహిదీపట్నం శంషాబాద్ పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ పిల్లర్ నంబరు 84 వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. బైకును కారు ఢీకొట్టింది. గూగుల్ మ్యాప్ అందించిన సమాచారం ప్రకారం వెళ్లడం సరైనది కాదని గ్రహించాడు. దారి తప్పినట్టు గ్రహించి రూటు మార్చాడు. గచ్చిబౌలి వెళ్లేందుకు పిల్లర్ నంబరు 82 వద్ద ఎక్స్‌ప్రెస్‌వే నుంచి ర్యాంపు ద్వారా కిందకు వెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ప్రమాదం సంభవించింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న22 ఏళ్ల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చరణ్ స్పాట్‌లో మృతి చెందాడు. మరో ఇద్దరు యువతులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. చరణ్ పోచారం వద్ద ప్రముఖ ఐటి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News