Monday, January 20, 2025

ఏఐ మేధావి నోమ్ షజీర్ కు గూగుల్ ఎందుకు భారీగా చెల్లించింది?

- Advertisement -
- Advertisement -

కృత్రిమ మేధో(ఏఐ) నిపుణుడు నోమ్ షజీర్‌ను తిరిగి నియమించుకోవడానికి గూగుల్ 2.7 బిలియన్ల డాలర్లను చెల్లిస్తోంది, ఆయన Character.AIని కనుగొనడానికి ఇదివరలో వదిలి వెళ్లాడు. నోమ్ షజీర్ ‘జెమిని’పై మళ్లీ పనిచేయడానికి తిరిగి వచ్చాడు.

48 ఏళ్ల సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్‌ను 2000లో గూగుల్ నియమించుకుంది, అతను తన సహోద్యోగి డేనియల్ డి ఫ్రీటాస్‌తో డెవలప్ చేసిన ‘చాట్ బాట్‌’ను విడుదల చేయాలన్నఅభ్యర్థనను తిరస్కరించిన తర్వాత 2021లో కంపెనీని విడిచిపెట్టాడని ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ రిపోర్టు చేసింది.

నోమ్ షజీర్, డేనియల్ డి ఫ్రీటాస్‌ Character.AIని కనుగొన్నారు, ఇది సిలికాన్ వ్యాలీలో హాటెస్ట్ AI స్టార్టప్‌లలో ఒకటిగా మారింది , గత సంవత్సరం $1 బిలియన్ విలువను చేరుకుంది. దీని తర్వాత, వారిద్దరూ గూగుల్ యొక్క AI యూనిట్ డీప్‌మైండ్‌లో చేరుతున్నట్లు గూగుల్ ప్రకటించింది , సుందర్ పిచాయ్ కంపెనీ తన టెక్నాలజీకి లైసెన్స్ ఇవ్వడంతో పాటు కంపెనీకి పని చేయడానికి నోమ్ షజీర్‌ను తిరిగి చేర్చుకోడానికి,  Character.AI కోసం $2.7 బిలియన్ చెల్లించిందని  ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ రిపోర్టు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News