Tuesday, April 1, 2025

గూగుల్ పిక్సెల్9a స్మార్ట్ఫోన్ వచ్చేస్తుందోచ్..

- Advertisement -
- Advertisement -

గూగుల్ తన లేటెస్ట్ పిక్సెల్ ఎ సిరీస్ స్మార్ట్‌ఫోన్ గూగుల్ పిక్సెల్ 9ఎను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ పిక్సెల్ 9ఎ భారతదేశంలో ఏప్రిల్ 16 నుండి అమ్మకాలు జరుగుతాయని తెలిపింది. కస్టమర్లు దీనిని ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ భాగస్వాముల నుండి కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్ నలుపు,తెలుపు, ఐరిస్ రంగుల్లో వస్తుంది. గూగుల్ పిక్సెల్ 9ఎ ధర రూ. ధర రూ.49,999గా నిర్ణయించారు. దీనిలో మీకు 8GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ లభిస్తుంది. ఇప్పుడు పిక్సెల్ 9ఎ ఫోన్ కు సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

కంపెనీ గూగుల్ పిక్సెల్ 9aలో తన తాజా ప్రాసెసర్ టెన్సర్ G4ని ఇన్‌స్టాల్ చేసింది. దీంతో ఫోన్ పనితీరు చాలా వేగంగా ఉంటుంది. ఈ చిప్‌తో పాటు.. టైటాన్ M2 సెక్యూరిటీ ప్రాసెసర్ కూడా ఇచ్చారు. ఇది ఫోన్ భద్రతను మరింత మెరుగుపరుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది 7 సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్, భద్రతా నవీకరణలను పొందడం కొనసాగిస్తుంది.

పిక్సెల్ 9ఎ120Hz రిఫ్రెష్ రేట్, 2,700 nits గరిష్ట బ్రైట్‌నెస్‌తో 6.3-అంగుళాల Actua pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇక బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే.. ఇది 5,100mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 23W ఫాస్ట్ ఛార్జింగ్, 7.5W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

కెమెరా విషయానికి వస్తే.. గూగుల్ పిక్సెల్ 9a ఫోన్‌లో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. కెమెరాతో పాటు అనేక అధునాతన AI ఫీచర్లు కూడా అందించారు.

పిక్సెల్ 9a లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉన్నాయి. కనెక్టివిటీ కోసం.. ఈ ఫోన్ లో 5G, Wi-Fi 6E, బ్లూటూత్ 5.3, NFC, USB టైప్-C 3.2 పోర్ట్ ఉన్నాయి. ఫోన్‌లో స్టీరియో స్పీకర్లు, డ్యూయల్ మైక్రోఫోన్‌లు కూడా ఉన్నాయి. ఇవి అద్భుతమైన ఆడియో నాణ్యతను నిర్ధారిస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News