Monday, December 23, 2024

ప్లేస్టోర్ నుంచి భారతీయ మాట్రిమోనీ యాప్‌ల తొలగింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సర్వీస్ రుసుము చెల్లింపులపై వివాదంలో గూగుల్ శుక్రవారం భారత్‌లో పది సంస్థల యాప్‌లను తొలగించసాగింది. వాటిలో భారత్ మాట్రిమోనీ వంటి పాపులర్ మాట్రిమోనీ యాప్‌లు కొన్ని కూడా ఉన్నాయి. ఇది స్టార్టప్ సంస్థలతో గూగుల్‌కు సంఘర్షణకు దారి తీస్తున్నది. 15 శాతం నుంచి 30 శాతం వరకు చార్జీలు వస్తూ చేయాలన్న పూర్వపు విధానాన్ని రద్దు చేయాలని భారత ఏంటీ ట్రస్ట్ అధికారులు ఆదేశించిన తరువాత యాప్ చెల్లింపులపై 11 శాతం నుంచి 26 శాతం వరకు రుసుము విధించకుండా గూగుల్‌ను నిలువరించేందుకు కొన్ని భారతీయ స్టార్టప్‌లు చేస్తున్న యత్నాలు ఈ వివాదానికి మూలం. అయితే, స్టార్టప్‌లకు ఎటువంటి ఉపశమనాన్నీ ఇవ్వవద్దంటూ జనవరి, ఫిబ్రవరి నెలల్లో రెండు కోర్టు తీర్పులు వచ్చిన తరువాత రుసుము వసూలుకు గానీ, యాప్‌ల తొలగింపునకు గానీ అనుమతి లభించిన తరువాత గూగుల్‌కు ఇందుకు ఉపక్రమించడం గమనార్హం.

మాట్రిమోనీ.కామ్ డేటింగ్ యాప్‌లు భారత్ మాట్రిమోనీ, క్రిస్టియన్ మాట్రిమోనీ, ముస్లిం మాట్రిమోనీ, జోడీలను శుక్రవారం తొలగించారని సంస్థ వ్యవస్థాపకుడు మురుగవేల్ జానకీరామన్ వెల్లడించారు. ఈ చర్య ‘భారతీయ ఇంటర్నెట్‌కు చీకటి దినం’ అని ఆయన పేర్కొన్నారు. ‘మా యాప్‌లను ఒకదాని తరువాత ఒకటిగా తొలగిస్తున్నారు’ అని జానకీరామన్ తెలిపారు. ప్లేస్టోర్ నిబంధనల ఉల్లంఘనలపై భారతీయ సంస్థలు మాట్రిమోనీ.కామ్, ఇన్ఫో ఎడ్జ్‌లకు ఆల్ఫాబెట్ ఇన్‌కార్పొరేషన్ విభాగం గూగుల్ నోటీస్‌లు పంపింది. మాట్రిమోనీ.కామ్ భారత్ మాట్రిమోనీ యాప్‌ను నిర్వహిస్తుందగా, ఇన్ఫో ఎడ్జ్ అటువంటి యాప్ జీవన్‌సాథిని నడుపుతోంది. రెండు సంస్థలు ఆ నోటీస్‌ను సమీక్షిస్తున్నాయని, తదుపరి చర్యలు తీసుకుంటాయని వాటి అధికారులు మీడియాకు తెలిపారు. మీడియా వార్త వచ్చిన తరువాత మాట్రిమోనీ.కామ్ షేర్లు 2.7 శాతం వరకు పడిపోగా, ఇన్ఫో ఎడ్జ్ షేర్లు 1.5 శాతం మేర దిగజారాయి. తాము పెండింగ్‌లో ఉన్న గూగుల్ ఇన్‌వాయిస్‌లు అన్నిటినీ సకాలంలో చెల్లించామని, దాని విధానాలను తాము పాటిస్తున్నామని ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్‌చందానీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News