Tuesday, November 5, 2024

గూగుల్ ఖాతాలో సైన్ ఇన్ చేయాలంటే నవంబర్ 9 నుంచి…

- Advertisement -
- Advertisement -
google sign in
టూ స్టెప్ వెరిఫికేషన్ తప్పనిసరి!
మీ ఫోన్ దగ్గరే ఉంచుకోండి!!

కొత్తగూడ(హైదరాబాద్): సైబర్ భద్రత దృష్టా గూగుల్ నవంబర్ 9 నుంచి సైన్ ఇన్ కావడానికి రెండు స్టెప్పుల వెరిఫికేషన్ తప్పనిసరి చేయనుంది. దానికి సంబంధించిన బటన్‌ను మీరు టర్న్ ఆన్ చేసుకోవాలి. అసలు ఇదెలా పనిచేస్తుంది?..మీరు మీ పాస్‌వర్డ్ ఎంటర్ చేశాక, మీ ఫోన్‌లో గూగుల్ ప్రాంప్ట్‌ను ట్యాప్ చేయాల్సి ఉంటుంది లేదా సైన్-ఇన్-కోడ్‌ను ఎంటర్(దీనికి మీ ఫోన్ క్యారియర్ నుంచి ఛార్జీలు పడతాయి) చేయాల్సి ఉంటుంది. మీ ఫోన్ మరియు రికవరీ ఇ-మెయిల్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా 2021 చివరికల్లా 150 మిలియన్ గూగుల్ యూజర్స్, 2 మిలియన్ యూట్యూబ్ యూజర్స్ ఈ ఫీచర్‌ను తప్పక ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గూగుల్ తన బ్లాగ్‌లో పేర్కొంది. అంతే కాక ఉప్పటికే గూగుల్ అకౌంట్‌ను ఉపయోగిస్తున్న వారికి ఈ విషయమై నవంబర్ 8న యూజర్ పేర్కొన్న ఇ-మెయిల్‌కు మెయిల్ కూడా పంపించారు.

టూ స్టెప్ వెరిఫికేషన్ ప్రకారం ఆ ఫీచర్‌ను యూజర్ ఎనేబుల్ చేసుకోవాలి. దాన్ని ఎనేబుల్ చేసిన తర్వాత యూజర్ పోన్ లేదా తాను పేర్కొన్న ఇ-మెయిల్‌కు ఓటిపి(వన్‌టైమ్ పాస్‌వర్డ్) వస్తుంది. దాన్ని టైప్ చేస్తేనే గూగుల్ అకౌంట్ ఓపెన్ కాగలదు. ఒకవేళ నవంబర్ 9లోపు యూజర్స్ ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేయకుంటే తర్వాత ఆటోమేటిగ్గా యాక్టివేట్ అవుతుందని కూడా గూగుల్ తెలిపింది.

ఎలా ఎనేబుల్ చేయాలంటే?: మీ జీమెయిల్ ఐడితో గూగుల్ లాగిన్ చేసిన తర్వాత కుడివైపు మీ పేరు లేదా ఫోటో ఉన్న ఐకాన్‌పై క్లిక్ చేయాలి. మేనేజ్ యూవర్ గూగుల్ అకౌంట్‌పై క్లిక్ చేశాక గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. ఆ సెట్టింగ్స్‌లో సెక్యూరిటీ ఆప్షన్ క్లిక్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే టూ స్టెప్ వెరిఫికేషన్ ఫీచర్ కనిపిస్తుంది. అక్కడ మీకు ఆఫ్ అని కనిపిస్తుంటే దానిపై క్లిక్ చేస్తే వెరిఫికేషన్ పూర్తి చేసేందుకు కొనసాగించమని కోరుతుంది. తర్వాత మీ ఫోన్‌కి ఓటిపి వస్తుంది. అది టైప్ చేస్తే టూ స్టెప్ వెరిఫికేషన్ యాక్టివేట్ అవుతుంది.

google2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News