Friday, November 15, 2024

చట్టాలకు కట్టుబడుతాం, స్వేచ్ఛ కోసం ఎదురుతిరుగుతాం

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్/ న్యూఢిల్లీ: తాము ఎప్పుడూ స్థానిక చట్టాలకు కట్టుబడి ఉంటామని, దీనిపై ఎటువంటి సందేహం అవసరం లేదని గూగుల్ ప్రధాన కార్యనిర్వాహణాధికారి (సిఇఒ) సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. వాట్సాప్ ఇతర సామాజిక మాధ్యమాలకు సంబంధించి భారత ప్రభుత్వం విధించిన నిబంధనలు సంబంధిత వివాదాస్పదాంశాల నేపథ్యంలో ఈ ఐటి సమాచార దిగ్గజం గూగుల్ స్పందన వెలువడింది. స్థానిక ప్రభుత్వం పరిస్థితులకు అనుగుణంగా విధించే నిబంధనలు, చట్టాలకు తాము కట్టుబడి ఉంటామని పిచాయ్ గురువారం తెలిపారు.అయితే వేగవంతంగా మారే సాంకేతిక పరిజ్ఞానం అందుకోవల్సి ఉంటుంది. ఇదే క్రమంలో తాము నియంత్రణ విధివిధానాలకు కట్టుబడి ఉండటం జరుగుతుందని ఆయన తేల్చిచెప్పారు. ఏ దేశానికి సంబంధించిన స్థానిక చట్టాలను అయినా గౌరవించాల్సిన బాధ్యత సంస్థగా తమపై ఉందన్నారు. నిబంధనల తొలినాళ్ల ఈ దశలో తమ సంస్థకు చెందిన స్థానిక బృందాలు ఎప్పటికప్పుడు అన్ని అంశాలను ఆకళింపు చేసుకుంటాయి. పరిపాలనా సౌలభ్యం లేదా సార్వత్రికత కోసం సామాజిక మాధ్యమాలకు సంబంధించి ప్రభుత్వాలు స్థానికంగా చట్టాలను తీసుకురావడాన్ని తాము తప్పుపట్టడం లేదని సుందర్ తెలిపారు. ప్రతి దేశంలో తాము కార్యకలాపాల నిర్వహణలోనే ఉంటామని, నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు.
అంతా ఓపెన్ సీక్రెటే
తమ సంస్థకు సంబంధించినంత వరకూ అంతా పారదర్శకంగానే ఉంటుంది. ఇందులో ఎటువంటి ధర్మసందేహాలకు అవకాశం లేదు. నిర్థిష్ట స్పష్ట రిపోర్టులతో ముందుకు సాగుతామన్నారు. ప్రభుత్వాల నుంచి ఎటువంటి ఆదేశాలు సందేశాలను అయినా తాము తమ ట్రాన్సపరెన్సీ రిపోర్టులో పొందుపర్చడం జరుగుతుందని తెలిపారు. ఆసియా పసిఫిక్‌కు చెందిన కొందరు ఎంచుకున్న రిపోర్టర్లతో సుందర్ పిచాయ్ వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాట్సాప్, ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలలో వెలువడుతోన్న విషయాలు కొన్ని వివాదాస్పదం అవుతున్నాయి. ఇదే దశలో వ్యక్తుల సమాచార గోప్యతకు భంగం వాటిల్లుతోందని, అన్నింటికి మించి అధికార వ్యవస్థకు అతీతంగా సామాజిక మాధ్యమ సంస్థలు వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్ నిక్కచ్చిగా అంతకు మించి నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని తెలిపారు.
స్వేచ్ఛాయుత ఇంటర్నెట్ భారతీయ సంప్రదాయం
ఇంటర్నెట్ సామాజిక భావ వ్యక్తీకరణకు కీలక వేదిక అయింది. ఈ దశలో స్వేచ్ఛాయుత, నిజాయితీ అంశాలు దీనికి ఖచ్చితంగా పునాదులే అవుతాయి. ఇక ఈ క్రమంలో భారతదేశానికి కూడా ఇదే చిరకాల సాంప్రదాయంగా ఉంటూ వస్తోందని సుందర్ వ్యాఖ్యానించారు. ఏదైనా స్వేచ్ఛయుతంగా ఉండాలనేదే తమ సంస్థ అభిమతం అని, దీని వల్ల కలిగే ప్రయోజనాలను అనుభవిస్తామని, వాటిని ప్రచారం చేస్తామని తేల్చిచెప్పారు.
కట్టుబాట్లనూ ఎదిరిస్తాం ..సంయమనం కీలకం
ప్రపంచస్థాయి నియంత్రణ వ్యవస్థలకు కట్టుబడి ఉండటం అనేది జరగుతుందని తెలిపారు. అయితే అంతా కూడా నిర్మాణాత్మకంగానే జరుగుతుంది. ఎక్కడ ఎటువంటి ప్రక్రియలు ఉన్నా వాటిలో తాము లీనం అవుతామని, ఇదే గూగుల్ అధ్యయనపు క్రమం అని తెలిపారు. కంపెనీ పలు దేశాల లెజిస్లేటివ్ విధానాలను అనుసరిస్తుంది. అయితే ఇదే సమయంలో ఎక్కడైనా ఏ విషయంలో అయినా నియంత్రణలను అడ్డుకోవల్సి వస్తే అది కూడా చేస్తామని, అయితే ఈ క్రమంలో ఎక్కడా సమతుల్యత దెబ్బతినకుండా చూసుకోవడం జరుగుతుందన్నారు. జన్మతః భారతీయుడు అయిన పిచాయ్ భారతదేశంలో ప్రస్తుత ఐటి నిబంధనలపై ఆచితూచి స్పందించారు.

Google to comply with India’s IT Rules:Sundar Pichai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News