Sunday, January 19, 2025

భారత్‌లో గూగుల్ వ్యాలెట్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : టెక్ కంపెనీ గూగుల్ భారతదేశంలో ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ప్రైవేట్ డిజిటల్ వాలెట్‌ను ప్రారంభించింది. ‘గూగుల్ వ్యాలెట్’ చెల్లింపుల నిర్వహణ చేపట్టదు, అయితే ‘గూగుల్ పే’ తన సేవలను కొనసాగిస్తుంది. గూగుల్ వ్యాలెట్ యాప్‌లో వినియోగదారులు డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, లాయల్టీ కార్డ్‌లు, గిఫ్ట్ కార్డ్‌లు, ఈవెంట్ టిక్కెట్‌లు, పాస్‌లు, ఇతర వస్తువులను నిల్వ చేయవచ్చు, వినియోగించవచ్చు. ఈ యాప్ డబ్బు, ఫైనాన్స్ నిర్వహణలో సహాయపడే గూగుల్ పే యాప్‌కి భిన్నంగా ఉంటుంది.

భారతీయ మార్కెట్‌లో తన ఉనికిని పెంచుకోవడానికి గూగుల్ 20కి పైగా బ్రాండ్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వీటిలో పివిఆర్, ఐనాక్స్, ఎయిర్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్, పైన్‌ల్యాబ్స్, కొచ్చి మెట్రో, అభిబస్ వంటి వ్యాపారాలు ఉన్నాయి. గూగుల్ వాలెట్‌లో వినియోగదారులు ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న సూపర్‌కాయిన్, షాపర్స్ స్టాప్, ఇతర బ్రాండ్‌ల బహుమతి కార్డ్‌లను నిల్వ చేయవచ్చు. గూగుల్ ఆండ్రాయిడ్ జిఎం, ఇండియా ఇంజినీరింగ్ లీడ్ రామ్ పాపట్ల మాట్లాడుతూ, గూగుల్ పే ప్రాథమిక చెల్లింపు యాప్‌గా కొనసాగుతుందని, అయితే గూగుల్ వాలెట్ నాన్-పేమెంట్ కోసం ప్రత్యేకంగా రూపొందించామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News