Wednesday, January 8, 2025

జిల్లా కలెక్టర్‌ను కలిసిన గోపాలమిత్ర యూనియన్ నాయకులు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ సిటీ: నిజామాబాద్‌కు చెందిన జిల్లా గోపాలమిత్ర జిల్లా అధ్యక్షుడు షేక్ సలీంతో జిల్లా గోపాలమిత్ర సంఘ సభ్యులు జిల్లా కలెక్టర్ కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో తాము చాలీచాలని జీతాలతో రాత్రి, పగలు లేకుండా విరామంగా గ్రామాలలో పశు వైద్య సేవలు అందిస్తున్నామని అయినప్పటికీ ప్రభుత్వం తమను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని గోపాల మిత్ర సంఘ సభ్యులను పశుశాఖలో విలీనం చేయాలని, 23 సంవత్సరాలుగా జిల్లాలో సేవలను అందిస్తున్నప్పటికీ ప్రభుత్వం తమను చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ అందరికి ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి, పదోన్నతులను కల్పించాలని గోపాల సంఘ సభ్యులు జిల్లా కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో జిల్లా గోపాల మిత్ర సంఘ అధ్యక్షుడు షేక్ సలీం, జిల్లా సెక్రెటరీ సర్దార్ కృష్ణ గౌడ్, ఎంఎన్‌బె, సుధీర్, దత్తాద్రి, ఆరిఫ్, ప్రసాద్ ఆర్కే ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News