Monday, December 23, 2024

విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన బస్సు డ్రైవర్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఏలూరు జిల్లా గోపవరంలో టిడిపి కార్యకర్త వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు. టిడిపి కార్యకర్త మురళి(50) విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఓ ప్రైవేటు కాలేజీలో గోపవరానికి చెందిన 20 మంది విద్యార్థులు చదువుతున్నారు. మురళి అసభ్యకర ప్రవర్తనపై తల్లిదండ్రులకు విద్యార్థినులు సమాచారం ఇవ్వడంతో గోపవరంలో బస్సును మురళిని విద్యార్థిని తల్లిదండ్రులు నిలదీశారు. మురళి విద్యార్థిని తండ్రితో ఘర్షణకు దిగి గాయపడ్డాడు. గత నెల 30న కాలేజీ బస్సు ఏలూరు నుంచి గోపవరం వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మురళి చర్యలతో భయపడి తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.

Also Read: రాహుల్ గాంధీ లీడర్ కాదు.. రీడర్: జగదీష్ రెడ్డి

నూజివీడు ఎంఎల్‌ఎ మేకా ప్రతాప్ అప్పారావును బాధితులు ఆశ్రయించారు. సదరు ఎంఎల్‌ఎ టిడిపి కార్యకర్త మురళి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. విద్యార్థినులు, వారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మురళిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో పలు కేసుల్లో మురళి నిందితుడిగా ఉన్నాడు. అన్ని కేసులను పరిగణలోకి తీసుకొని మురళిపై చర్యలు తీసుకుంటామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News