Wednesday, January 22, 2025

పవర్‌ఫుల్ పోలీస్ అధికారి ‘భీమా’గా…

- Advertisement -
- Advertisement -

మాచో హీరో గోపీచంద్ తన 31వ సినిమా కోసం ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ.హర్షతో చేతులు కలిపారు. యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్ ప్రొడక్షన్ నెం. 14గా నిర్మాత కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర నిర్మాతలు సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా లాంచ్ చేశారు. ఈ చిత్రానికి ‘భీమా’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ని లాక్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో గోపీచంద్ ఫెరోషియస్ పోలీసు అధికారిగా ఇంటెన్స్ రోల్‌లో కనిపించారు.

Also Read: 100 రోజుల ‘వీర సింహారెడ్డి’

ఫస్ట్ లుక్‌లో గోపీచంద్ ఆవేశపూరితంగా చూస్తూ రగ్గడ్ లుక్ కనిపించారు. బ్యాక్ గ్రౌండ్‌లో ఒక ఎద్దును కూడా మనం చూడవచ్చు. ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాలో గోపీచంద్ వైల్డ్ క్యారెక్టర్‌ని సూచిస్తుంది. కన్నడలో పలు బ్లాక్‌బస్టర్‌లను అందించిన హర్ష ఈ భారీ బడ్జెట్ చిత్రంతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. కుటుంబ భావోద్వేగాలు, ఇతర అంశాలతో కూడిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ’భీమా’ రూపొందనుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది, హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు మేకర్స్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News