Monday, December 23, 2024

వెండితెర ‘రాముడు’ సూచించిన ‘రామబాణం’

- Advertisement -
- Advertisement -

మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌లది టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ కాంబినేషన్‌. లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్లను అందించారు. ఇప్పుడు మూడో సారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టి జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి నిర్మిస్తున్నారు.ఇందులో హీరో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు, అన్నయ్యగా, కుష్బూ వదినగా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గోపీచంద్ కెరీర్‌లో 30వ సినిమాగా రాబోతోన్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం ముగింపు దశలో ఉన్నాయి.

సంక్రాంతి శుభవేళ చిత్రం పేరు ను ‘‘రామబాణం‘‘ గా ప్రకటిస్తూ చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రం ఆకట్టు
కుంటోంది. యువరత్న నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం విశేష ప్రేక్షకాదరణ పొందు తోందన్న విషయం విదితమే. ఈ కార్యక్రమంలో నే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మాచో స్టార్ గోపీచంద్ లు పాల్గొన్న సందర్భంలో, అదికూడా వెండితెరపై శ్రీరాముడు పాత్రను సమున్నత రీతిలో అద్వితీయంగా పోషించిన యువరత్న బాలకృష్ణ గారి ద్వారా చిత్రం పేరును ‘‘రామబాణం‘‘ గా ప్రకటించడం తమకెంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు చిత్ర దర్శకుడు శ్రీవాస్, నిర్మాతలు టి జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సామాజిక సందేశం కూడా మిళితమైన బలమైన కథాంశం ఉన్న చిత్రమిది.

ఈ చిత్రంలో సరికొత్త గోపీచంద్‌ను చూడబోతున్నారు.‘లక్ష్యం, లౌక్యం వంటి విజయవంతమైన చిత్రాల తరువాత మళ్లీ గోపీచంద్, శ్రీవాస్ లు కలసి పనిచేయటంతో హ్యాట్రిక్ కొట్టబోతున్నారన్న అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఆ రెండు సినిమాలను మించేలా ఉండాలని ఈ సినిమా ని శ్రీవాస్ ఓ బాధ్యత తో తీర్చి దిద్దుతున్నాడు. గోపీచంద్ 30 వ చిత్రం గా వస్తున్న ఈ సినిమాని పీపుల్ మీడియా సంస్థ అధినేత లు టి.జి. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల వ్యయానికి వెనకాడకుండా చాలా గ్రాండ్ గా సమున్నత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్‌తో నిర్మాణం చేస్తూ ఈ చిత్రం విజయంపై నమ్మకంతో ఉన్నారు.

ఈ సినిమాకి కథని భూపతి రాజా, అందించగా,వెట్రి పళని స్వామి ఛాయాగ్రహణం, మిక్కీ జే మేయర్ సంగీతం, ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చనున్నాయి. 2023 వేసవి కానుకగా చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు చిత్ర నిర్మాతలు టి జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో , సచిన్ ఖేడ్ ఖర్, నాజర్, ఆలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి,కాశీ విశ్వనాథ్, సత్య,గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా, తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సాంకేతిక బృందం
డైరెక్టర్ : శ్రీవాస్
నిర్మాతలు : టి జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల
బ్యానర్ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం : మిక్కీ జే మేయర్
డీఓపీ : వెట్రి పళని స్వామి
స్టోరీ : భూపతి రాజా
డైలాగ్స్ : మధుసూధన్ పడమటి
ఆర్ట్ డైరెక్టర్ : కిరణ్ కుమార్ మన్నె
పి ఆర్ ఓ: లక్ష్మీ వేణుగోపాల్, వంశీ- శేఖర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News