Monday, December 23, 2024

కన్నడ దర్శకుడితో నెక్స్ట్ మూవీ

- Advertisement -
- Advertisement -

గోపీచంద్ ప్రస్తుతం ‘రామబాణం’ సినిమా చేయడంలో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత సినిమా కూడా ఖరారైంది. కన్నడ దర్శకుడు హర్షతో ఆయన ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. హర్ష ఇటీవల శివరాజ్ కుమార్‌తో ‘వేద’ అనే చిత్రాన్ని రూపొందించారు. కన్నడలో ఇది పెద్ద హిట్.

తెలుగులో కూడా ఇదే పేరుతో డబ్ అయింది. కన్నడలో వచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో గోపీచంద్… హర్షతో సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. మార్చి 3న ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదో పూర్తి స్థాయి యాక్షన్ డ్రామా. గోపీచంద్‌కు ఇలాంటి కథలు బాగా సరిపోతాయి. అందుకే ఈ సినిమాకు వెంటనే ఓకే చెప్పాడు. రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News