Saturday, October 26, 2024

గోపీచంద్ ‘రామబాణం’ ఫస్ట్ సింగిల్ ఐఫోన్ లిరికల్ విడుదల

- Advertisement -
- Advertisement -

మాచో హీరో గోపీచంద్ రామబాణం ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రోజు రామబాణం ఫస్ట్ సింగిల్ ఐఫోన్ లిరికల్ వీడియోను విడుదల చేసిన మ్యూజికల్ జర్నీ ప్రారంభించారు.

మిక్కీ జె మేయర్ హై-స్పీడ్ బీట్‌లతో కూడిన మాస్ డ్యూయెట్‌ను కంపోజ్ చేశారు. అద్భుతమైన వోకల్స్, సూపర్బ్ డ్యాన్సులు, క్లాసీ విజువల్స్ తో ఇది మాస్ యుఫోరియాను సృష్టిస్తుంది. మాస్ పాటలు రాయడంలో స్పెషలిస్ట్ అయిన కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. తెలంగాణ యాసలో ఈ పాటను రాశారు. రామ్ మిరియాల, మోహన భోగరాజు వోకల్స్ లో కావాల్సిన ఎనర్జీ ఉంది.

గోపీచంద్, డింపుల్ హయాతి గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ తో ఆకట్టుకున్నారు. ఈ మాస్ డ్యూయెట్ లో చాలా కూల్‌గా కనిపించి, రాకింగ్ కెమిస్ట్రీని పంచుకున్నారు. గోపీచంద్ స్టైలిష్ అవతార్‌లో కనిపించగా, డింపుల్ సూపర్-హాట్‌గా కనిపించారు. ఐఫోన్ మాస్ ని ఆకట్టుకుటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో గోపీచంద్ పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు.

భూపతి రాజా ఈ చిత్రానికి కథను అందించగా, వెట్రి పళని స్వామి సినిమాటోగ్రఫీ, మిక్కీ జె మేయర్ సంగీతం ఈ చిత్రానికి బలం చేకూర్చనున్నాయి. మధుసూదన్ పడమటి డైలాగ్స్ అందించగా, ప్రవీణ్ పూడి ఎడిటర్. జగపతి బాబు, ఖుష్బు ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సమ్మర్ కానుకగా మే 5న రామబాణం విడుదలకు సిద్ధమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News