Monday, December 23, 2024

ఆ హిట్ దర్శకుడితో మూడవ సినిమా ‘రామ బాణం’?

- Advertisement -
- Advertisement -

హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ ముచ్చటగా మూడవ సారి కలిసి ఓ భారీ మూవీ చేస్తున్నారు. వీరిద్దరి కలయికలో రూపొందిన ‘లక్ష్యం’ సూపర్ హిట్ అనిపించుకోగా ఆ తరువాత వచ్చిన ’లౌక్యం’ ఫరవాలేదనిపించింది. ఈ ఇద్దరి కలయికలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఓ భారీ మూవీ తెరకెక్కుతోంది. టి.జి. విశ్వప్రసాద్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రల్లో జగపతిబాబు, ఖుష్బూ నటిస్తున్నారు. హీరోయిన్ గా డింపుల్ హయాతీ నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది.

’లక్ష్యం’ సెంటిమెంట్‌ని పునరావృతం చేయాలనే పట్టుదలతో దర్శకుడు శ్రీవాస్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీ గోపీచంద్ నటిస్తున్న 30వ ప్రాజెక్ట్. దీంతో ప్రతీ విషయంలోనూ చాలా ప్రత్యేకంగా వుండాలని మేకర్స్, దర్శకుడు శ్రీవాస్ చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు.

గోపీచంద్ కెరీర్‌లో స్పెషల్ మూవీగా వుండాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంత వరకు టైటిల్ ఫైనల్ కాని ఈ మూవీకి ’రామ బాణం’ అనే టైటిల్‌ని దర్శకుడు శ్రీవాస్ ఫైనల్ చేసినట్టుగా తెలిసింది. మళ్లీ అన్నాదమ్ముల సెంటిమెంట్ నేపథ్యంలో ’లక్ష్యం’కు మించిన స్థాయిలో ఈ మూవీ వుండేలా దర్శకుడు శ్రీవాస్ ప్లాన్ చేస్తున్నట్టుగా టైటిల్‌ని బట్టి అర్థమవుతోందని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News