Wednesday, January 22, 2025

గోరటికి కేంద్ర సాహిత్య అవార్డు ప్రదానం

- Advertisement -
- Advertisement -

Gorati Venkanna received Central Literary Academy Award

మనతెలంగాణ/ ఢిల్లీ : కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కవి, రచయిత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అందుకున్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర సాహిత్య అకాడమీ 2021 పురస్కారాలల్లో అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర కంబరా చేతుల మీదుగా ఆయనకు ప్రదానం చేశారు. గోరటి వెంకన్న రచించిన ’వల్లంకి తాళం’ కవిత సంపుటికి సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. 2021 సంవత్సరంలో 24 కవులు, రచయితలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించారు. తన కవితా సంపుటిని గుర్తించిన జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలని, సాహిత్య అకాడమీ అవార్డు రావడం సంతోషంగా ఉందని వెంకన్న తెలిపారు. సిఎం కెసిఆర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ, పలువురు అభినందనలు తెలపడం ఆనందంగా ఉందన్నారు. నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని వెంకన్న వెల్లడించారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ ద్వారా ఎన్‌వి రమణ చేతుల మీదుగా గతంలో అవార్డు కూడా తీసుకున్నానని సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న గోరటి వెంకన్న తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News