Sunday, January 19, 2025

కాంగ్రెస్‌లో చేరిన గూర్ఖా నేత తమాంగ్

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: గతంలో తృణమూల్ కాంగ్రెస్‌తో ఉన్న గూర్ఖా నాయకుడు బినయ్ తమాంగ్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. డార్జిలింగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరినుంచి ఆయన పార్టీ పతాకాన్ని స్వీకరించారు. తమాంగ్ గతంలో పశ్చిమ బెంగాల్‌లోని గూర్ఖాల్యాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ (జిటిఎ)కు చైర్మన్‌గా పని చేశారు. గూర్ఖా జనముక్తి మోర్చా నాయకుడు బిమల్ గురుంగ్‌కు

సన్నిహితుడైన తమాంగ్ ఆ తర్వాత ఆయనతో విభేదించి అధికార తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. 2019లో జిటిఎ చైర్మన్ పదవినుంచి వైదొలగిన ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ మద్దతుతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2021లో ఆయన టిఎంసిలో చేరారు కానీ ఏడాది తిరిగే లోగానే ఆ పార్టీని వీడారు. కాగా త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో తమాంగ్ డార్జిలింగ్ లోక్‌సభ స్థానంనుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News