Sunday, November 24, 2024

ఆర్యన్ ఖాన్ కేసులో సాక్షి  మరో కేసులో అరెస్టు?!

- Advertisement -
- Advertisement -

Kiran Gosavi arrested

ముంబయి: బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ డ్రగ్స్ కేసులో సాక్షి అయిన కిరణ్ గోసవిని గురువారం పుణే పోలీసులు గురువారం అరెస్టు చేసింది. అయితే వేరే కేసులో ఈ అరెస్టు చేయడం గమనార్హం. అంటే 2018 నాటి ఓ చీటింగ్ కేసులో అతడిని అరెస్టు చేసింది. ఇదిలావుండగా గోసవి లొంగిపోయాడు అన్న రిపోర్టులను పుణే పోలీస్ కమిషనర్ అమితాబ్ గుప్తా ఖండించారు. ముంబయి పోలీసులు లేక ఇతర సంస్థలు గోసవిని తమ కస్టడీకి అప్పగించాలని ఇంతవరకు కోరలేదని, అయితే ఒకవేళ వారు కోరుకునే పక్షంలో కోర్టుకు వెళ్లవచ్చని కూడా ఆయన అన్నారు. నాలుగేళ్ల కిందటి కేసులో అతడిని అరెస్టు చేయడంపై ఏవైనా రాజకీయ ప్రమేయాలున్నాయా అని అడిగినప్పుడు ఆయన లేదని తెలిపారు.
గోసవి లక్నో, జబల్‌పూర్, హైదరాబాద్, ఫతేపూర్‌లలో ఉన్నప్పుడు తనను తాను సచిన్ పాటిల్‌గా పరిచయం చేసుకున్నాడని, సిఐబిసిఎ గూఢచారి సంస్థ, స్టాప్ క్రైమ్ ఎన్‌జిఒ సభ్యుడనని పరిచయం చేసుకున్నాడని, తాను ఎగుమతి-దిగుమతి వ్యాపారం కూడా చేస్తున్నానని నమ్మించాడని గుప్తా తెలిపారు. కాగా సోసల్ మీడియా ఫోటోల ఆధారంగా తాము అతడి కోసం వెతుకుతున్నామని కూడా వివరించారు. కాగా పుణే పోలీసులు చీటింగ్ కేసులో 2019 మేలో గోసవిపై ఛార్జీషీటు దాఖలుచేశారు.

మలేషియాలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనకు రూ. 3.09 లక్షలు మేరకు గోసవి మోసం చేశాడని చిన్మయి దేశ్‌ముఖ్ అనే వ్యక్తి చీటింగ్ కేసు దాఖలు చేశాడు. కాగా అతడి అసిస్టెంట్ షేరబానో కురేషీని పోలీసులు ఇదివరకే అరెస్టుచేశారు. ఇదిలావుండగా తానే పోలీసులకు లొంగిపోయానని గోసవి కొని న్యూస్ ఛానల్స్‌కు చెప్పారు. పుణే పోలీసులు గోసవి ఆచూకీ కనుగొనేందుకు రెండు బృందాలను సోమవారం రూపిందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News