Thursday, December 26, 2024

మేయర్‌ను కలిసి గోషామహల్ బీఆర్‌ఎస్ నేతలు

- Advertisement -
- Advertisement -

గోషామహల్: తెలంగాణ భవన్‌లో శనివారం జరిగిన హైదరాబాద్ నగర బీఆర్‌ఎస్ పార్టీ సమావేశానికి గోషామహల్ నుండి పార్టీ నా యకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్బంగా గోషామహల్ నియోజకవర్గం ఎస్సీ విభాగం కార్వనిర్వాహక అధ్యక్షులు ఎర్ర రవి, హబీబ్‌కుమార్‌లు సమావేశంలో పాల్గొన్న గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిని కలిసి స్థానిక ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి డివిజన్ ఒక వార్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం పట్ల ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సుపరిపాలన, సత్వర సమస్యల పరిష్కా రం కోసం 9 శాఖల సిబ్బందిని నియమించి, సత్వర పౌర సేవలు అందించేందుకు గ్రేటర్ పరిధిలో 150 వార్డు కార్యాలయాల ఏర్పాట్లకు చర్యలు తీ సుకున్న తెలంగాణ ప్రభుత్వానికి, సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News