Monday, January 20, 2025

ఓ ఇంటివాడు కాబోతున్న దేవి శ్రీ ప్రసాద్..ఆమె వయసు ఎంతంటే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్. 17 ఏళ్ల వయసులోనే దేవి అనే సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. దేవి సినిమా హిట్ అయింది. దీంతో ఆ సినిమా టైటిల్ నే తన పేరులో దేవిగా యాడ్ చేసుకున్నాడు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో మరోసారి మ్యూజిక్ డైరెక్టర్ గా తానేంటో నిరూపించుకున్నాడు దేవి శ్రీ ప్రసాద్.

అయితే ఇప్పుడు ఆయన పెళ్లి వార్తలు మరోసారి సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకునే అమ్మాయి వయసు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 43 ఏళ్ల దేవి శ్రీ ప్రసాద్ కి వరుసకు మరదలు అయ్యే కాబోయే భార్య వయసు 26 సంవత్సరాలు. ఇద్దరి మద్య వయసు గ్యాప్ 17 సంవత్సరాలు. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ దేవి శ్రీ ప్రసాద్ ఓ ఇంటివాడు అవుతున్నాడని ఫ్యాన్స్ మాత్రం ఆనందం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News