Wednesday, January 22, 2025

రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పు.. లేదంటే దున్నపోతులతో..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రేవంత్ రెడ్డి రాజనీతి శాస్త్రం తెలియని ఓ రౌడీ రాజకీయ నాయకుడని గొల్లకురుమ హక్కుల పోరాట సమితి వ్యవష్థాపక అధ్యక్షులు గోసుల శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఓ ప్రధాన రాజకీయ పార్టీ అధ్యక్షుడినని చెప్పుకుంటూ యాదవ మంత్రిని ఆర్థిక, కుల అహంకారంతో దూషించిన హీనడని విమర్శించారు. రేవంత్ రెడ్డి 24 గంటల్లో యాదవులకు క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో దున్నపోతులు, గొర్రెపొట్టేళ్ళతో గాంధీభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. యాదవులు శ్రీకృష్ణుని వారసులని, పశుపాలకులు, పరిపాలకులని తెలిపారు.

Also Read: డబుల్ బెడ్రూం ఇండ్లు ఎన్ని కేటాయించారు : బండి సంజయ్

రేవంత్ రెడ్డి కుల అహంకారంతో మాట్లాడాడని ధ్వజమెత్తారు. పెండ పిసికి, వ్యవసాయం చేసి ప్రపంచానికి అన్నం పెట్టే యావులమని, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మాంసం ఉత్పత్తి చేసే వృతి తమదని అన్నారు. రాజకీయ చరిత్ర తెలియని రేవంత్ రెడ్డి ఆర్థిక, కుల అహంకారంతో ఒక యాదవ మంత్రిని నోటికి వచ్చినట్లు మాట్లాడడం యాదవ సమాజాన్ని అవమాన పరుచడమేనని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పక పోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతామని, రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా దున్నపోతులు, గొర్రె పొట్టేలు నీ మిదికి దూసుకువస్తాయని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News