Sunday, January 19, 2025

వచ్చింది కొంత…పంచేది ఎంత?

- Advertisement -
- Advertisement -

సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు నామమాత్రపు వరద
డెడ్ స్టోరేజీకి చేరిన నీటి నిల్వలు
శ్రీశైలంలో 88 టిఎంసిలు, సాగర్‌లో 153 టిఎంసిల నీరు
ఇప్పటికే 47టిఎంసిలను వాడేసిన ఆంధ్రప్రదేశ్
తెలుగు రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాలు కొండంత
మే వరకు తాగునీటికి కేటాయింపులు చేయాలని కోరుతున్న తెలంగాణ..

30 టిఎంసిల కోసం ఎపి పట్టు
కొద్దిపాటి నిల్వలతో కేటాయింపులు ఎలా?
ఎన్‌జిటి ఆదేశాలు ధిక్కరించి ఎస్‌ఆర్‌ఎంసికి లైనింగ్
ఎపిపై కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు
నేడు త్రిసభ్య కమిటీ సమావేశం

మనతెలంగాణ/హైదరాబాద్ :  కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో నైరుతి రుతు పవనాల ప్రభావంతో కురవాల్సిన వర్షాలు తేలిపోయాయి. అరకొర వర్షాల వల్ల వచ్చిన వరద నీటికి ఎగువన మహారాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల వద్దే అడ్డుకట్ట పడింది. కృష్ణానదిలో నీటి ప్రవాహం అడుగంటి తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు ఊస్సూరు మంటున్నాయి. శ్రీశై లం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు అంతం త మాత్రమే ఉన్నాయి. తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ల్లో కృష్ణజలాల అవసరాలు మాత్రం కొండంతగా ఉన్నా యి.రెండు రాష్ట్రాల్లో ఆయకట్టుకు సాగు నీటిని అందిం చే మాట అటుంచి ఈ సారి తాగునీటికి కూడా ముందుజాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ వర్షాకాలం ప్రారంభమయ్యాక ఇప్పటివరకూ ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 102 టీఎంసీల నీరు మాత్రమే చేరింది. ఈ నీటి కోసం రెండు రాష్ట్రాలు తమ అవసరాలను ఏకరువు పెడుతున్నాయి.ఇందులో కూడా ఏపి ఇప్పటికే 47టిఎంసీల నీటిని వాడేసిందని తెలంగాణ రాష్ట్రం బో ర్డుకు ఫిర్యాదు చేసింది. నేపథ్యంలో ఆదివారం జలసౌధలో కృష్ణానదీయాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ స మావేశాన్ని నిర్వహించనుంది. బోర్డు సభ్యకార్యదర్శి డి.ఎం రాయపురే కమిటీ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ , ఏపి నుంచి ఈఎన్సీ నారాయణరెడ్డి త్రిసభ్య కమిటీలో పాల్గొననున్నారు. గత నెల 21న త్రిసభ్యకమిటీ సమావేశం నిర్వహించినప్పటికీ ఆనాటి సమావేశానికి తెలంగాణ
ఈఎన్సీ హాజరుకాలేదు. దీంతో కమిటీ కన్వీనర్ రాయపురే , ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి మధ్యనే కృష్ణానదీజలాలకు సంబంధించిన చర్చలు జరిగాయి. ఈ సమవేశంలో ఆంధ్రప్రదేశ్ రా్రష్ట్ర అవసరాలకు 25.29టిఎంసీలు, తెలంగాణ రాష్ట్ర అ వసరాలకు 6.04 టిఎంసీలు విడుదల చేయాలని ముసాయిదా ప్రతిపాదన చేశారు. తెలంగా ణ రా్రష్ట్రం నుంచి ఈఎన్సీ పాల్గొనకుండానే ఏకపక్షంగా ఆనాటి సమావేశంలో చేసిన ముసాయిదా వివాదాస్పదంగా మారింది. ఈ నేపధ్యం లో మరో సారి కృష్ణాబోర్డు త్రిసభ్యకమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాలు తమ తమ రాష్ట్రాల తాగు సాగు నీటి అవసరాలతో ఇండెంట్లు సిద్దం చేసుకుని సమావేశానికి సిద్దమవుతున్నాయి.
మే వరకూ తాగునీటికి నీటిని కేటాయించాలి: తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి అవసరాలను దృ ష్టిలో ఉంచుకుని వచ్చే మేవరకూ శ్రీశైలం , నా గార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి నీటిని కేటాయించాలని తెలంగాణ రాష్ట్రం బోర్డు త్రిసభ్యకమిటీలో ప్రతిపాదించనుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా నీటి అవసరాలను దృష్టిలో పె ట్టుకుని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జలవిద్యుత్ ఉ త్పత్తి అనంతరం సాగర్‌కు నీటిని విడుదల చే యాల్సిన అవసరాన్ని బోర్డు దృష్టికి తీసుకుపోనుంది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కల్వకుర్తి ఎ త్తిపోతల పథకం ద్వారా 5.55టిఎంసీలు , నా గార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు , హైదరాబాద్ మహానగర ప్రజల తాగునీటి అవసరాలకు మొత్తం 15. 40టిఎంసీల నీటిని కేటాయించాలని కోరే అవకాశం ఉన్నట్టు సమాచారం. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా 6టిఎంసీలు కలిపి మొ త్తం 26.95టిఎంసీల మేరకు తెలంగాణకు నీటికేటాయింపులు కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా సెప్టెంబర్ అవసరాలకు సాగనీటికోసం 38.73టీఎంసీల నీటిని కోరనుంది. ఇందులో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 15.73టిఎంసీలు , నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి 23టిఎంసీల నీటిని కోరే అవకాశం ఉన్నట్టు సమాచారం.
30టిఎంసీలు కోరిన ఎపి
ఆంధ్రప్రదేశ్ రా్రష్ట్రం కృష్ణానదీజలాల్లో తమవంతుగా 30టిఎంసీల నీటిని కోరుతోంది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 13.2టిఎంసీలు , హంద్రీనీవా సు జల స్రవంతి ప్రాజెక్టుకు 9టిఎంసీలు, నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి కుడి కాలువకు 9టిఎంసీలు, ఎడమ కాలువ ఆయకట్టుకు 1.99 టిఎంసీల నీటి అవసరాలు ఉన్నట్టు బోర్డు దృష్టికి తెచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
కొద్దిపాటి నిల్వలతో కేటాయింపులు ఎలా!
శ్రీశైలం , నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో నీటి ని లువలు రెండు రాష్ట్రాల అవసరాలకు ఏమాత్రం సరిపోయేలా లేవని అధికారులు చెబుతున్నారు. కృష్ణానది ద్వారా ఎగువ నుంచి జూరాల ప్రాజెక్టుకు 104.73టిఎంసీలు చేరగా, శ్రీశైలం ప్రాజెక్టుకు ఈ ఏడాది ఇప్పటివరకూ 102.16టీఎంసీల నీరు చేరింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 853అడుగుల వద్ద 88టీఎంసీల నీరు నిలువ ఉంది. నాగార్జున సాగర్‌లో 213 అడుగుల వద్ద 153టిఎంసీల నీరు నిలువ ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ రెండు రిజర్వాయర్లలో కనీస నీటిమట్టాల దిగువన ఉన్న డెడ్‌స్టోరేజీగా మిగిలిపోయే నీటిని మినహాయిస్తే ఇక ఎండిడిఎల్‌పైన నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకునే రెండు రాష్ట్రాల నీటి అవసరాలను తీర్చాల్సివుంది. త్రిసభ్యకమిటీలో ఈ అంశాలన్నింటిని సమగ్రంగా చర్చించి ఆచి తూచి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు కృష్ణాబోర్డు వర్గాలు పేర్కొన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News