కొలంబో: శ్రీలంక మాజీ అధ్యక్షుడు రాజపక్స దుబాయ్ నుంచి తిరిగొచ్చారు. గతేడాది శ్రీలంక ఆర్థికవ్యవస్థ కుప్పకూలిపోవడంతో ప్రజాగ్రహాన్ని చవిచూసిన రాజపక్స పదవిని కోల్పోయారు. రాజపక్స ఆయన భార్య లోమా గురువారం అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టారని స్థానిక మీడియా నివేదించింది. రాజపక్స దంపతులు దుబాయ్ నుంచి విచ్చేశారని విమానాశ్రయ అధికారి, ఇమిగ్రేషన్ విభాగం అధికార ప్రతినిధి తెలిపినట్లు లంక వార్తాపత్రిక మిర్రర్ తెలిపింది.
ఎమిరేట్స్‌కు చెందిన విమానంలో దుబాయ్ నుంచి కొలంబో వచ్చినట్లు పేర్కొంది.కాగా బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందింన తరువాత తొలిసారి గతేడాది తీవ్ర ఆర్థికసంక్షోభంలో చిక్కుకుపోయింది. దేశవ్యాప్తంగా ప్రజల ఆగ్రహావేశాలు మధ్య అప్పటి అధ్యక్షుడు రాజపక్స (73) శ్రీలంక నుంచి మాల్దీవులకు పారిపోయారు. సింగపూర్‌కు చేరుకుని గతేడాది జులై 14న అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పించారు.