- Advertisement -
అమరావతి: కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచలేదని ఇకపై పెంచదని ఎపి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ ఛార్జీల పెంపు అంశంపై శాసన మండలిలో సభ్యుల ప్రశ్నలకు గొట్టిపాటి సమాధానమిచ్చారు. విద్యుత్ ఛార్జీల పెంపు పాపం మాజీ సిఎం జగన్ దేనని మండిపడ్డారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు 9 సార్లు ఛార్జీలు పెంచారని గుర్తు చేశారు. విద్యుత్ ఛార్జీలు వాళ్లే పెంచి, వాళ్లే ధర్నాలు చేసి, వాళ్లే ప్రశ్నలు అడగడం ఒక వింత పరిస్థితి అని మంత్రి గొట్టిపాటి విమర్శించారు.
- Advertisement -