Monday, January 20, 2025

కాంగ్రెస్ అధికార ప్రతినిధి బిజెపిలో చేరిక

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ గురువారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిపోయారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తాను మాట్లాడలేనని, అలాగే సంపద సృష్టికర్తలను తాను నిత్యం దూషించలేనని కాంగ్రెస్ అద్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. దిశానిర్దేశం లేని పార్టీలో తనకు అసౌకర్యంగా ఉందని ఆయన చెప్పారు.

పరధాని నరేంద్ర మోడీ వికసిత భారత్ అజెండాకు మద్దతుగా తాను బిజెపిలో చేరుతున్నానని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. కాగా..బీహార్ మాజీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనిల్ శర్మ కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పార్టీ తీసుకున్న వైఖరిని తప్పుపడుతూ పార్టీకి రాజీనామా చేశారు. ఆర్‌జెడి నాయకుడు ఉపేంద్ర ప్రసాద్‌తో కలసి ఆయన బిజెపిలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News