Wednesday, January 22, 2025

అంబానీని వెనక్కినెట్టిన అదానీ

- Advertisement -
- Advertisement -

దేశంలో అత్యంత సంపన్నుడిగా నిలిచిన గౌతం అదానీ
97.6 బిలియన్ డాలర్లకు పెరిగిన సంపద

సుప్రీం తీర్పు తరువాత షేర్లు జంప్

న్యూఢిల్లీ : హిండెన్‌బర్గ్ ఆరోపణలపై కొత్త దర్యాప్తును సుప్రీం కోర్టు తిరస్కరించిన తర్వాత అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారం బిలియనీర్ గౌతమ్ అదానీ సంపద గణనీయంగా పెరిగింది. దీంతో భారత్‌లో నంబర్ వన్ సంపన్నుడిగా ఉన్న ముకేశ్ అంబానీని అదానీ వెనక్కినెట్టి ముందు వరుసలో నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ మరోసారి భారతదేశపు అత్యంత సంపన్నుడిగా మారారు. షేర్ల పెరుగుదల కారణంగా గౌతమ్ అదానీ ప్రపంచ ర్యాంకింగ్‌లో టాప్ 12 స్థానానికి ఎగబాకారు. దీంతో అంబానీ ఒక స్థానం దిగజారి 13వ స్థానంలో ఉన్నాడు. గౌతమ్ అదానీ నికర విలువ ఒక సంవత్సరంలో 13 బిలియన్ డాలర్లు (రూ. 1.08 లక్షల కోట్లు) పెరిగింది. దీంతో మొత్తం నికర విలువ 97.6 బిలియన్ డాలర్లకు (రూ. 8.12 లక్షల కోట్లు) చేరుకుంది. కాగా ముకేశ్ అంబానీ నికర విలువ ఈ ఏడాది రూ.665 మిలియన్లు (రూ. 5 వేల కోట్లు) పెరిగి 97 బిలియన్ డాలర్లకు (రూ. 8.07 లక్షల కోట్లు) చేరింది.
వరల్డ్ నంబర్ వన్‌గా మస్క్
ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ టెస్లా సిఇఒ ఎలోన్ మస్క్ రూ.18.31 లక్షల కోట్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తగా నిలిచారు. రెండో స్థానంలో రూ. 14.06 లక్షల కోట్లతో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ నిలిచారు. ఇక రూ.13.98 లక్షల కోట్ల నికర విలువతో ఎల్‌విఎంహెచ్‌కి చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ మూడో స్థానంలో ఉన్నారు.
సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత పెరుగుదల..
అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయం కారణంగా అదానీ గ్రూప్‌లోని మొత్తం 10 షేర్లు పెరిగాయి. దీంతో అదానీ నికర విలువ గణనీయంగా పెరిగింది. గత ఏడాది జనవరి 24న అమెరికన్ షార్ట్ సెల్లర్ కంపెనీ హిండెన్‌బర్గ్ గౌతమ్ అదానీపై వాటాల మానిప్యులేషన్, మనీలాండరింగ్ ఆరోపణలు చేసింది. ఆ తర్వాత కంపెనీ షేర్లు భారీగా నష్టపోయాయి. ఈ ఆరోపణల తర్వాత అదానీ నికర విలువ దాదాపు 60 శాతం తగ్గి, మొత్త్ విలువ 69 బిలియన్ డాలర్లకు (రూ. 5.7 లక్షల కోట్లు) పడిపోయింది.
సెబీ విచారణ
అదానీహిండెన్‌బర్గ్ కేసును విచారించేందుకు సుప్రీంకోర్టు ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో పాటు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని కూడా దర్యాప్తు చేయాలని కోరింది. అదానీకి క్లీన్‌చిట్ అనే విధంగా జనవరి 3న సుప్రీం కోర్టు తన తీర్పులో నాలుగు పెద్ద విషయాలను చెప్పింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News