Wednesday, January 22, 2025

అదానీ ఆమ్దానీ డబుల్

- Advertisement -
- Advertisement -

Goutham adani income 1612 crore per day

గతేడాదిలో రెట్టింపైన అదానీ సంపాదన
ముకేశ్ అంబానీని వెనక్కినెట్టి మొదటి స్థానానికి చేరిన వైనం
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 వెల్లడి

న్యూఢిల్లీ : ప్రపంచంలో రెండో అత్యంత సంపన్నుడు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 2021 సంవత్సరంలో ప్రతి రోజూ రూ.1,612 కోట్లను సంపాదించారని ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 వెల్లడించింది. ఆయన సంపద ఏడాది వ్యవధిలో రెండింతలు పెరిగింది. గత ఏడాది కాలంలో ఆయన ఆస్తులు ప్రతిరోజూ రూ.1612 కోట్లు పెరిగాయని నివేదిక తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని అదానీ వెనక్కినెట్టి జాబితాలో మొదటి స్థానానికి చేరుకున్నారు. సంపదలో వేగవంతమైన వృద్ధి కారణంగా అదానీ ఇటీవల ఫోర్బ్ జాబితాలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించి, ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచాడు. తాజాగా ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 ప్రకారం, అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో భారీ పెరుగుదల కారణంగా గతేడాదిలో అదానీ సంపద 116 శాతం పెరిగి రూ.5,88,500 కోట్లకు చేరింది. ప్రస్తుతం అదానీ నికర విలువ రూ.10,94,400 కోట్లకు పెరిగింది. గత 5 సంవత్సరాల కాలంలో కొనుగోళ్లు, కొత్త వ్యాపారంలోకి ప్రవేశించడం వల్ల అదానీ సంపద పెరుగుదల 1440 శాతంగా ఉంది.

అదానీ గ్రూప్‌లోని మొత్తం ఏడు లిస్టెడ్ కంపెనీల షేర్లలో పెరుగుదల కారణంగా మార్కెట్ విలువ భారీగా పెరిగింది. హురున్ ఇండియా ఎండి, చీఫ్ రీసెర్చర్ అనస్ రెహ్మాన్ జునైద్ ప్రకారం, 2022 సంవత్సరంలో ఒక భారతీయ సంస్థగా సంపదను పెంచడంలో అదానీ గ్రూప్ ఈ అద్భుతమైన పెరుగుదలను చూపింది. మొత్తం ఏడు కంపెనీల మార్కెట్ క్యాప్ లక్ష కోట్ల రూపాయలకు పైగా ఉన్న ఏకైక భారతీయుడు గౌతమ్ అదానీ అని ఆయన అన్నారు. అదానీ గ్రూప్ ఇటీవలే అంబుజా సిమెంట్, ఎసిసి లను కొనుగోలు చేయడం ద్వారా సిమెంట్ రంగంలోకి ప్రవేశించి, దేశంలో రెండో అతిపెద్ద సిమెంట్ సంస్థగా అవతరించింది.

హురున్ రిచ్ లిస్ట్‌లో నేహా నార్ఖేడే

స్ట్రీమింగ్ డేటా టెక్నాలజీ కంపెనీ కాన్‌ఫ్లూయెంట్ సహ వ్యవస్థాపకురాలు నేహా నార్ఖేడే కూడా ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ హురున్ ఇండియా 2022 జాబితాలో చోటు సంపాదించగలిగారు. 37 ఏళ్ల నేహా నార్ఖెడే అత్యంత పిన్న వయస్కురాలు, స్వీయ-నిర్మిత మహిళా పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు. రూ. 13,380 కోట్ల నికర సంపదతో దేశంలోని 10 మంది సంపన్న మహిళల్లో నేహా నార్ఖేడే 8వ స్థానంలో ఉన్నారు. నేహా నార్ఖేడే కాన్‌ఫ్లూయెంట్‌ను ప్రారంభించే ముందు లింక్‌డిన్‌తో కలిసి పనిచేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News