Sunday, January 12, 2025

రియలిస్టిక్ మూవీ

- Advertisement -
- Advertisement -

శింబు కథానాయకుడిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా ’వెందు తనిందదు కాడు’. ఇందులో సిద్దీ ఇధ్నానీ కథానాయిక. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి. కె.గణేష్ భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రాన్ని ’ది లైఫ్ ఆఫ్ ముత్తు’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది శ్రీ స్రవంతి మూవీస్. నిర్మాత ’స్రవంతి’ రవికిశోర్ ఈ సినిమాను విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ.. “తమిళనాడులో ఒక పల్లెటూరిలో సినిమా కథ జరుగుతుంది. తెలుగులో విడుదల చేయాలనుకున్నప్పుడు… ఏ ఊరు అయితే బావుంటుంది? హీరో మాట్లాడే యాస ఎలా ఉండాలి? అని కొంత రీసెర్చ్ చేశాం. డబ్బింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. సాధారణంగా నేను రివ్యూలు చదవను. కొన్ని రివ్యూలలో ’గౌతమ్ మీనన్ సినిమాల్లో హీరో బైక్ మీద తిరుగుతూ అమ్మాయితో పాటలు పాడుకుంటాడు’ అని రాశారు. కానీ, ఈ సినిమాలో అవి ఏవీ లేవు. నేను ఇంతకు ముందు తీసిన సినిమాలకు డిఫరెంట్ సినిమా ఇది. శింబు కాబట్టి… సినిమాను ఇంత రియలిస్టిక్‌గా చేశా. తెలుగు, తమిళ ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి స్పందన లభిస్తోంది” అని అన్నారు. నిర్మాత ’స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ “నాకు ఈ సినిమా బాగా నచ్చింది. ఇంతకు ముందు మా సంస్థ ద్వారా నాయకుడు, పుష్పక విమానం, రెండు తోకల పిట్ట, రఘువరన్ బీటెక్ చిత్రాలు విడుదల చేశాం. ఆ సినిమాల తరహాలో ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సిద్ధీ ఇధ్నానీ పాల్గొన్నారు.

Goutham Meenon Speech at ‘Life of Muttu’ Press Meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News