Monday, December 23, 2024

వ్యాపారాలు ఇక 24గంటలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇకపై 24 గంటలు షాపులు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 24/7 షాపులు తెరిచి ఉంచేందుకు వీలు కల్పిస్తూ, తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1988ను సవరించింది. షాపులు 24 గంటలు తెరిచి ఉంచేందుకు ఏడాదికి రూ.10 వేలు అదనంగా చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఉద్యోగులకు సంబంధించిన రికార్డులు ప్రభుత్వానికి అందించాలని, మహిళా ఉద్యోగుల అనుమతితోనే నైట్ షిప్ట్ వేయాలని, నైట్ షిఫ్ట్‌లో పనిచేసే మహిళలకు వెహికిల్ పిక్ అప్ అండ్ డ్రాపింగ్, రాత్రి వేళ్ళలో పనిచేసే మహిళా సిబ్బందికి తగిన భద్రత కల్పించాలని షరతు విధించింది. సిబ్బందికి విధిగా ఐడి కార్డులు జారీ చేయాలని, ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్మిక చట్టాల ప్రకారం పనిగంటలు నిర్ణయించాలని, ఎక్కువ పనిగంటలు పనిచేసేవారికి ఓవర్ టైమ్ డబ్బులు ఇవ్వాలని, వీక్ ఆఫ్‌లతో పాటు పండుగలకు సెలవులను ఇవ్వాలని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News