Monday, December 23, 2024

3 నుంచి మరో దఫా ఎలక్టోరల్ బాండ్స్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సోమవారం నుంచి దేశంలో ఎలక్టోరల్ బాండ్ల 27వ విడత జారీ, విక్రయాల ప్రక్రియ ఆరంభం అవుతుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని వెలువరించింది. దేశంలో వచ్చే కొద్ది నెలల్లోనే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ దశలోనే ఎలక్టోరల్ బాండ్ల అమ్మకాలకు అనుమతి కల్పించారు. వివిధ రాజకీయ పార్టీలు నగదు విరాళాలకు బదులుగా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా నిధులు సమకూర్చుకుంటున్నాయి. రాజకీయ నిధుల సమీకరణకు సరైన లెక్కలు ఉండేందుకు , పారదర్శకతకు ఈ ఎలక్టోరల్ బాండ్స్ పద్ధతి తీసుకువచ్చారు.

ఈ 27వ ఎలక్టోరల్ బాండ్స్ విక్రయాల ప్రక్రియలో భాగంగా ఎస్‌బిఐకి వీటిని జారీ చేసే అధికారం కల్పించారు. దీని మేరకు ఎస్‌బిఐకి చెందిన 29 అధీకృత శాఖల ద్వారా జులై 3 నుంచి 12 మధ్యలో వీటిని కొనుగోలు చేయవచ్చునని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. జారీ అయిన తరువాత ఎలక్టోరల్ బాండ్స్ 15రోజుల పాటే చలామణిలో ఉంటాయి. దీని తరువాత వీటిని డిపాజిట్ చేసినా విలువ లేకుండా పోతాయి. ఎలక్టోరల్ బాండ్స్‌ను భారతీయ పౌరులు ఎవరైనా లేదా సంస్థలు అయినా కొనుగోలు చేయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News