Monday, December 23, 2024

ఇళ్ల మరమ్మతులకు ప్రభుత్వ సాయం ఎంతో ఉపశమనం: డిప్యూటీ మేయర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వాంబే, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లకు మరమ్మతులకు ప్రభుత్వం రూ. 100 కోట్ల నిధులను మంజూరు చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని డిప్యూటీ మేయర్ మోతె శోభన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో శిథిలావస్థలో ఉన్నా ఇళ్ల బాధితుల్లోనూ ఆశలు చిగురించాని ఆమె తెలిపారు.ఈ నేపథ్యంలో తార్నాకలోని చంద్రబాబు నాయుడు నగర్ బస్తీ వాసులు, స్థానికులతో డిప్యూటీ మేయర్ తార్నాకలోని తన క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.9100 కోట్లతో డబుల్ బెడ్‌రూం ఇండ్లను సర్కారు అందిస్తోందని, గతంలో కట్టిన నిర్మాణాలకు సంబంధించిన భవనాల మరమ్మతులకు నిధులు కేటాయించడం గొప్ప విషయమని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో గులాబీ జెండా మూడోసారి ఎగరడం ఖాయమని, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులే అందుకు తార్కాణమని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

సొంతిఇళ్లు లేనివారితో పాటు వర్షాల కారణంగా ఇళ్లు కూలి ఇబ్బందులు పడుతున్న వారికి డబుల్ బెడ్‌రూం ఇల్లు అందేలా తమవంత సహకారం అందిస్తామని తెలిపారు.. అంతకు ముందు , ఇటీవల భారీ వర్షాల కారణంగా ఇల్లు కోల్పోయిన బాధితులను డిప్యూటీ మేయర్‌తో బీఆర్‌ఎస్ కార్మిక విభాగం అధ్యక్షులు మోతె శోభన్ రెడ్డి పరామర్శించి, వారికి ఆర్థికంగా అండగా నిలవడంపట్ల బాధితులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News