Wednesday, January 22, 2025

ప్రభుత్వ బ్యాంకులకు ప్రైవేటీకరణ ముప్పు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ముప్పు పొంచి ఉందని అఖిల భారత అధికారుల సమాఖ్య(ఎఐబిఒసి) ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంకుల ప్రైవేటీకరణ వల్ల ఇప్పుడు ఉన్న బ్యాంకుల సంఖ్య తగ్గుతుంది. అతి కొద్ది బ్యాం కుల ఆధిపత్యానికి దారితీస్తుంది. ఈ ర కమైన గుత్తాధిపత్యం ఖాతాదారుల, ప్ర జల ప్రయోజనాలను దెబ్బతీస్తాయని, బ్యాంకింగ్ సే వలు ప్రియం అవుతాయని ఎఐబిఒసి పేర్కొంది. ఈ సందర్భంగా ఎఐబిఒసి తెలంగాణ రాష్ట్ర అ ధ్యక్షులు ఎస్.అప్పస్వామి మాట్లాడుతూ, బ్యాం కుల జాతీయకరణ తర్వాత దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని అన్నారు.

బ్యాంకుల జా తీయకరణ సందర్భంగా ఎఐబిఒసి తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. బ్యాంకులు దేశాభివృద్ధికి ఎలా పనిచేశాయి, వీటి తో ప్రజలకు బ్యాంకింగ్ సౌకర్యాలు వంటి విషయాలను ఆయన వివరించారు. హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం ద్వారా దేశం ఆహార పాడి, మత్స రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిందని తెలిపారు.

ఎఐబిఒసి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జి.నాగేశ్వర్ మా ట్లాడుతూ, దేశం స్వాతంత్య్రం ముందు, తర్వాత బ్యాంకింగ్ ప్రై వేట్ సంస్థలు, వ్యక్తుల ఆధీనంలో ఉండేదని అన్నారు. అయితే బ్యాంకింగ్ వ్యవస్థను ప్రజలకు అందుబాటులో కి తీసుకురావడానికి 1969 జులై 19న కేంద్ర ప్రభుత్వం 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయ చేసింది. అలాగే 1980లో 8 బ్యాంకులను జాతీయం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్‌కుమార్, సతీష్, వెంకన్న, కె.ఆంజనేయ ప్రసాద్, ఎం.విక్రమ్, ఐ.కృష్ణ రాజు, టి.హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News