Monday, December 23, 2024

నేడు అఖిల పక్ష భేటీ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌కు ముందుగా మంగళవారం వివిధ పార్టీల సభా నేతల సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పార్లమెంట్‌లో తాము లేవదీయాలనుకున్న అంశాలను వివిధ పార్టీల నేతలు ప్రస్తావించడం, తన అజెండా గురించి సంక్షిప్త సమాచారాన్ని ప్రభుత్వం ఇవ్వడం, వారి సహకారాన్ని కోరడం ప్రతి సెషన్‌కు ముందు పరిపాటి. కాగా, ఈదఫా సమావేశాలు సంక్షిప్తంగానే ఉంటాయి. బుధవారం (31) నుంచి ఫిబ్రవరి 9 వరకు మాత్రమే సమావేశాలు జరుగుతాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందుగా మధ్యంతర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టనున్నారు. కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News