Monday, December 23, 2024

గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే పంజుగుల రోహిత్ రెడ్డి

పెద్దేముల్: గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం తట్టేపల్లి నుంచి అడ్కిచర్ల వరకు రూ.23కోట్లతో జరుగుతున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు. వర్షకాలం సమీపిస్తున్న వేళా పనులను త్వరితగతినా పూర్తిచేయాలని ఆదేశించారు. అతిత్వరలోనే తట్టేపల్లి పరిసర ప్రాంతాలలో జరుగుతున్న రోడ్ల పనులను పూర్తి చేయిస్తానన్నారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలేత్తకుండా రోడ్డు పనులను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపిటిసిల ఫోరం ఉపాధ్యక్షుడు వెంకటేశ్‌చారి, సర్పంచ్, ఎంపిటిసి సంఘాల అధ్యక్షులు జనార్ధన్ రెడ్డి, ధన్‌సింగ్, బీఆర్‌ఎస్ యూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, బిఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షుడు నారాయణ్ రెడ్డి, సీనియర్ నాయకులు రమేశ్, రవినాయక్, శ్రావణ్, పాండు, భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News