Monday, December 23, 2024

గ్రామాలాభివృద్ధికి ప్రభుత్వం కృషి

- Advertisement -
- Advertisement -
  • జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

చేర్యాల: గ్రామాలాభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం రోజున పల్లె ప్రగతి కార్యక్రమo భాగంగా మండలంలోని శభాష్ గూడం గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించబోయే నూతన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని, గ్రామాలాభివృద్ధే లక్ష్యంగా సిఎం కెసిఆర్ పనిచేస్తున్నాడని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్లు నుంచి పల్లెలకు మహర్దశ చోటుచేసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఉల్లంపల్లి కరుణాకర్, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అనంతల మల్లేశం, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పెడతల ఎల్లారెడ్డి, గ్రామ సర్పంచ్ బొడ్డు స్వప్న కిరణ్, బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News