Wednesday, January 22, 2025

అన్ని కులవృత్తులకు ప్రభుత్వ ప్రోత్సాహం

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే శంకర్‌నాయక్

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: రాష్ట్రముఖాభివృద్దితో పాటు అన్ని కులవృత్తులను ప్రోత్సహించేలా సీఎం కేసీఆర్ సుపరిపాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందని ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీసీ, మైనార్టీ బందు చెక్కుల పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మూడు వందల మందికి బీసీ బంధు చెక్కులను జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో ఆ శాఖాధికారులతో కలసి ఎమ్మెల్యే చెక్కులను అందించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదరిస్తుందని, రాబోయే కాలంలో ప్రతిపక్ష పార్టీల నేతలు వచ్చి అసత్య ప్రచారాలు చేస్తే వారిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వారు చేసే అసత్యప్రచారాలు నమ్మి మోసపోవద్దని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వానికి అండగా ఉంటేనే సంక్షేమ పథకాలు అన్నివర్గాల ప్రజలకు అందుతాయని పేర్కోన్నారు.

ప్రజా సంక్షేమం నిరంతరం పాటుపడే బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు అండగా నిలువాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మైన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, వైస్ చైర్మైన్ ఎండి. ఫరీద్, అన్ని మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, గ్రామ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ చైర్మైన్లు, డైరెక్టర్లు , బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News