కరీంనగర్ :స్టీట్ వెండర్స్ చిరు వ్యాపారులు భవితకు రాష్ట్ర ప్రభుత్వం భరోసాగా ఉంటుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్ బోయి నపల్లి వినోద్‌కుమార్అన్నారు. ఆదివారం కరీంనగర్ నగరంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన స్టీట్ వెండర్స్ (చిరు వ్యాపారులు) సమావే శంలో వినోద్‌కుమార్ ముఖ్య అతిథిగాపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో చిరు వ్యాపా రులు తమ వ్యాపారాలు చేసుకునే విధంగా ప్రభుత్వంపరంగా గట్టి చర్యలు తీసుకుంటామన్నారు.
చిరు వ్యాపారులకు కొన్ని వర్గాల నుండి వేధింపులు వస్తున్నాయి అన్న ఫిర్యాదుపై వినోద్‌కుమార్ స్పందిస్తూఇలాంటి వేధింపులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కరీంనగర్ మేయర్ వై సునీల్‌రావు, చిరు వ్యాపారుల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు ఆలీ బాక్రి, ప్రధాన కార్యదర్శి ఆనంద్, స్థానిక నాయకులు రవీందర్‌రావు, సాజిద్, తదితరులు పాల్గొన్నారు.