Sunday, November 24, 2024

కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సేవలను పొడిగించిన ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

Government extends contract and outsourcing services

కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసిన ఆర్ధిక శాఖ

మన తెలంగాణ/హైదరాబాద్ : వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సిం గ్ సేవలను ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు ఆర్ధికశాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1216 మంది ఏఎన్‌ఎంలు అవుట్ సోర్సింగ్ సేవల కింద కొనసాగుతుండగా, కాంట్రాక్ట్ పద్దతిలో 613 మంది అసిస్టెంట్ ప్రోఫెసర్లు, ట్యూటర్లు పనిచేస్తున్నారు. అంతేగాక అవుట్ సోర్సింగ్ విధానంలో 281 ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో పాటు పబ్లిక్ హెల్త్ పరిధిలో కాంట్రాక్ట్ విధానంలో మరో 264 మంది సర్జన్లు, 212 మంది ల్యాబ్ టెక్నీషియన్లు సేవలు అందిస్తున్నారు. దీంతో పాటు వైద్యవిధాన పరిషత్ కమీషనర్ పరిధిలో కాంట్రాక్ట్ పద్దతిన 881 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, అవుట్ సోర్సింగ్ విధానంలో 510 ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఏఎన్‌ఎంలు కొనసాగుతున్నారు. వీరందరికి మరో ఏడాది కాలం సేవలు అందించేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అంతేగాక ఖాళీ పోస్టులను వాక్ ఇన్ ఇంటర్వ్యూల ద్వారా కాంట్రాక్ట్, అవుట్ సోర్సిం గ్ విధానంలో భర్తీ చేయాలని ఆర్ధికశాఖ కలెక్టర్లకు సూచించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News