- Advertisement -
న్యూఢిల్లీ: పశు, కోళ్ల దాణా తయారీలో ప్రధాన ముడి పదార్థమైన నూనె తీసేసిన ధాన్యం తవుడు ఎగుమతిపై నిషేధాన్ని వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం సోమవారం ప్రకటించింది. ఈ నిషేధం మొదట ఈ ఏడాది జులైలో అమలులోకి వచ్చింది. నూనె తీసేసిన ధాన్యం తవుడు ఎగుమతిపై నిషేధాన్ని 2024 మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.
కాగా..దేశంలో పాల ధరలు పెరగడానికి పశు దాణా ధరల పెరుగుదల ఒక ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఎగుమతులపై నిషేధం విధించడం వల్ల దేశీయ మార్కెట్‌లో ఇది మరింత అందుబాటులోకి రాగలదని, దీని వల్ల పాల ధరలను కట్టడి చేయగలమని వారె అభిప్రాయపడుతున్నారు. పశు దాణాలు ధాన్యం తవుడును 25 శాతం ఉపయోగిస్తారని ఒక అంచనా.
- Advertisement -