న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలను షెడ్యూల్ కంటే ముందుగానే ముగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ప్రభుత్వ వ్యవహార శైలిపై కూడా కాంగ్రెస్ మండిపడింది. పెరిగిన పెట్రోల్ ధరలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని, పారిపోతోందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది పెట్రో ధరలపై చర్చిస్తామని బీఎసీ సమావేశంలో ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ ఇప్పుడు సమయం ఇవ్వడం లేదని , అసలు దాని ఊసే ఎత్తడం లేదని లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరి మండిపడ్డారు. ఇక రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అయినాసరే తాము విడిచిపెట్టకుండా వీధుల్లో నిరసనలు చేస్తూనే ఉంటామని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం వరకు సభ నడపాలని నిర్ణయించినా రెండు రోజుల ముందే ముగించడం బాగోలేదని ప్రజల సమస్యపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని స్పష్టమౌతోందని ఆయన అన్నారు.
పెట్రో ధరల పెంపుపై చర్చించకుండా ప్రభుత్వం పారిపోయింది : కాంగ్రెస్
- Advertisement -
- Advertisement -
- Advertisement -