Sunday, December 22, 2024

తాగునీటి పర్యవేక్షణకు స్పెషల్ ఆఫీసర్లు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. తాగునీటి సరఫరాపై పర్యవేక్షణకు ప్రభుత్వం జిల్లాలవారీగా పది మంది సీనియర్ ఐఎఎస్ అధికారులను నియమించింది. ఈ మేరకు ప్ర ధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జా రీ చేశారు. తాగునీటి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారులతో అన్ని జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించనున్నట్లు స్ప ష్టత ఇచ్చారు. ఈ స్పెషల్ ఆఫీసర్లు రాష్ట్రంలో ని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించనున్నారు. జులై చివరి వరకూ పర్యవేక్షణ చర్యలను ప ర్యవేక్షించాలనిసిఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్పెషల్ ఆఫీసర్లు ఈ సమయంలో సెలవుల కోసం దరఖాస్తు చేసుకోవద్దని, అన్ని జిల్లాల్లో తాగునీటి సరఫరాపై దృష్టి సారించాలని తెలిపారు.

స్పెషల్ ఆఫీసర్లు.. వారికి కేటాయించిన జిల్లాలు : ప్రశాంత్ జీవన్ పాటిల్ (ఆదిలాబాద్, నిర్మల్), కృష్ణ ఆదిత్య (ఆసిఫాబాద్, మంచిర్యాల), ఆర్‌వి కర్ణన్ (కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల), అనితా రామచంద్రన్ (నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట), ఎ.శరత్ (నిజామాబాద్, కామారెడ్డి), విజయేంద్రబోయి(రంగారెడ్డి,వికారాబాద్, మల్కాజిగిరి), శృతి ఓజా (మహబూబ్‌నగర్, నారాయణపేట,వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్), బి.గోపి (వరంగల్, హన్మకొండ, జనగాం, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్), భారతి హొళికేరి (మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట), సురేంద్రమోహన్(ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం).

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News